TS PRC Calculator 2021: పీఆర్‌సీలో మీకు పెరిగిన జీతం ఎంతో తెలుసా.. అయితే ఈ క్యాలిక్యులేటర్‌తో చూసుకోండి..!

Pay in TS PRC: పీఆర్సీని ఎలా చూడాలి..? మనకు ఎంత ఫిట్‌మెంట్‌ లభించింది..?   అయితే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఎలా చూసుకోవచ్చు..? ఇలాంటి వివరాలను తెలుసుకునేందుకు..

TS PRC Calculator 2021: పీఆర్‌సీలో మీకు పెరిగిన జీతం ఎంతో తెలుసా.. అయితే ఈ క్యాలిక్యులేటర్‌తో చూసుకోండి..!
PRC Online calculator
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 22, 2021 | 6:05 PM

PRC Calculator: పీఆర్సీని ఎలా చూడాలి..? మనకు ఎంత ఫిట్‌మెంట్‌ లభించింది..?   అయితే ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని ఎలా చూసుకోవచ్చు..? తెలంగాణ ప్రభుత్వం ప్రకటిచిన పీఆర్‌సీతో మీ జీతం ఎంత పెరిగింది..? ఇలాంటి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి…

ముందుగా “పీఆర్‌సీ” అంటే “పే రివిజన్ కమిషన్”. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం ఇవ్వాలి? ఎంత భత్యం ఇవ్వాలి వంటివి సిఫార్సు చేసే కమిటి. ప్రతి అయిదేళ్లకోసారి ఈ సంఘాన్ని కొత్తగా నియమిస్తుంది ప్రభుత్వం. ఈ సంఘం ఇచ్చే సిఫార్సును పరిశీలించిన ప్రభుత్వం.. ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా జీతాలు పెంచడం ఎలా అనేదే ఈ ముఖ్య ఉద్దేశ్యంగా ఉంటుంది. పీఆర్‌సీ చెప్పిన దానికంటే కాస్త ఎక్కువే జీతాలు పెంచడం అన్ని ప్రభుత్వాలు పాటిస్తున్న ఆనవాయితీ.

అయితే కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి కమిటీని “పే కమిషన్” అంటారు. తెలుగు రాష్ట్రాల్లో “పే రివిజన్ కమిషన్” అంటారు. అయిదేళ్లకోసారి ప్రభుత్వం పే రివిజన్ కమిషన్‌ని వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 2018 మేలో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సీఆర్ బిస్వాల్, ఉమామహేశ్వర రావు, మహమ్మద్ అలీ రఫత్‌లతో పీఆర్‌సీ వేసింది.

అంతకుముందు 2013 నాటి పీఆర్‌సీ ప్రకారం 2014లో తెలంగాణ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే తొలి వేతన సంఘం. తెలంగాణ తొలి పీఆర్‌సీ 2020 డిసెంబరులో తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది..

పీఆర్‌సీలో ఏ అంశాలు ఉంటాయి..

1.  సెలవులు 2. ఇంటి అద్దె భత్యం 3. జీతం పెంపు.. ఎవరికి ఎంత.. 4. గ్రేడ్ 1, 2 ఉద్యోగులకు ప్రయాణ సౌకర్యాలు 5. వివిధ అలవెన్సులు

అయితే ప్రభుత్వ ఇచ్చిన పీఆర్‌సీని ఎలా చూడాలి..? ఎలా తెలుసుకోవచ్చు..? అనే ప్రశ్నలు చాలా మంది ఉద్యోగులను వెంటాడుతుంటాయి. అయితే ఇలాంటి వాటిని తెలుసుకునేందుకు ఓ క్యాలిక్యులేటర్ అందుబాటులో ఉంది. ఇక్కడ ఇచ్చిన క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మన ఫిట్‌మెంట్‌‌ను తెలుసుకోవచ్చు.

ఇలా https://www.teachersteam.co.in/prc/prcfixation.php తెలుసుకోండి..

సీఎం కేసీఆర్ ప్రకటన …

ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా మరో మూడేళ్లు పెరగనుంది. ప్రస్తుతమున్న 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచనున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయిన క్రమంలో ఈ మేరకు వారికి హామీ ఇచ్చారని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ప్రభుత్వం.. ఉద్యోగులు, సర్కార్‌ ఒకటేనని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి 29 శాతం పీఆర్సీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు ఉద్యోగులు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్‌ 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లోని టీఎన్‌జీవో కార్యాలయంలో, బీఆర్‌కే భవన్‌లో ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌ ప్రకటించారని టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్‌ అన్నారు.

కరోనా కష్టకాలంలో కూడా ఫిట్‌మెంట్‌ ప్రకటించడం హర్షణీయమని చెప్పారు. చిల్లర సంఘాలు అని ఎద్దేవా చేసినవాళ్ల నోర్లు మూతపడేలా ఫిట్‌మెంట్‌ ప్రకటించారని చెప్పారు. 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కష్టాన్ని తండ్రిలా పరిష్కరించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని టీఎన్జీవో నేత ముజీబ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి: AADHAR CARD: పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ‘జీవన్ ప్రమాణ్’ కోసం ఆధార్ తప్పనిసరి కాదన్న కేంద్రం

Malaika Arora Is The Hottest: బోల్డ్ ఫోటోలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న మలైకా అరోరా.. లైక్ చేసిన ప్రియుడు అర్జున్ కపూర్

ఈ పనిని 10 రోజుల్లో చేయండి..! లేకపోతే మీ పాన్ కార్డు పనికిరాదు..! 10 వేల వరకు ఫైన్ కూడా పడే ఛాన్స్..!