Facebook disabled:130 కోట్ల నకిలీ ఖాతాలు ఔట్.. కోటికి పైగా పోస్టులు, వీడియోలను తొలగించిన ఫేస్ ‌బుక్

ఫేక్ అకౌంట్ల బడతం పడుతోంది ఫేస్ బుక్. తప్పుడు ఖాతలతో తప్పుడు పనులు చేస్తున్నవారికి కత్తెర పెడుతోంది. 2020 అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఏకంగా 130 కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు ఫేస్​బుక్..

Facebook disabled:130 కోట్ల నకిలీ ఖాతాలు ఔట్.. కోటికి పైగా పోస్టులు, వీడియోలను తొలగించిన ఫేస్ ‌బుక్
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 22, 2021 | 11:11 PM

 Facebook Fake Accounts: ఫేక్ అకౌంట్ల బడతం పడుతోంది ఫేస్ బుక్. తప్పుడు ఖాతలతో తప్పుడు పనులు చేస్తున్నవారికి కత్తెర పెడుతోంది. 2020 అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఏకంగా 130 కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు ఫేస్​బుక్ ప్రకటించింది. కరోనా టీకాపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేలా ఉన్న కోటికి పైగా పోస్టులు, వీడియోలను తీసేసినట్లు తెలిపింది.

2020 అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య 130కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సోమవారం వెల్లడించింది. తమ  వేదికపై తప్పుడు, నకిలీ సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు 35వేల మందికి పైగా పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ తమ బ్లాగ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం చేరవేసేలా ఉన్న 12 మిలియన్లకు పైగా పోస్టులను ఇప్పటి వరకు తీసివేసింది. పోస్టులతోపాటు వీడియోలను తొలగించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

గతేడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో వైరస్‌, కొవిడ్‌ వ్యాక్సిన్లపై సోషల్‌మీడియాలో అనేక వదంతులు ప్రచారం సాగింది. తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. అయితే ఈ కథనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు ఇలాంటి ప్రచారంను నిలిపి వేయాలని తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో రంగంలోకి దిగిన ఫేస్ బుక్ యాజమాన్యం నకిలీ వార్తలపై దృష్టిపెట్టి  అలాంటి ఖాతాలను గుర్తించి, పోస్టులను తొలగించేసింది. ఇక ముందు కూడా ఇలాంటి ఖాతాలపై స్పెషల్ ఫోకస్ ఫెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:  TS PRC Calculator 2021: పీఆర్‌సీలో మీకు పెరిగిన జీతం ఎంతో తెలుసా.. అయితే ఈ క్యాలిక్యులేటర్‌తో చూసుకోండి..!

Alert ! LIC: ఎల్ఐసీ ఖాతాదారులకు ముఖ్య సూచన..ఈ ఫారం నింపకపోతే మీ డబ్బులు ఇరుక్కుపోతాయి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?