LG Electronics: సంచలన నిర్ణయం దిశగా ఎల్జీ.. ఇకపై ఆ ఫోన్లు మార్కెట్‌లో కనిపించబోవా…?

LG Electronics: ఎల్జీ కంపెనీ గురించి తెలియని వారుండరు. దాదాపు వినియోగదారులు అంతా ఎల్జీ ప్రోడక్ట్స్‌ను కొనుగోలు చేయడానికే ఎక్కువగా ఆసక్తి

LG Electronics: సంచలన నిర్ణయం దిశగా ఎల్జీ.. ఇకపై ఆ ఫోన్లు మార్కెట్‌లో కనిపించబోవా...?
Lg Mobiles
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 23, 2021 | 6:06 AM

LG Electronics: ఎల్జీ కంపెనీ గురించి తెలియని వారుండరు. దాదాపు వినియోగదారులు అంతా ఎల్జీ ప్రోడక్ట్స్‌ను కొనుగోలు చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కారణం. దాని బ్రాండ్ వాల్యూ అలాంటిది మరి. అయితే స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే మాత్రం ఎల్జీ కంపెనీకి డిమాండ్‌ చాలా తక్కువగా ఉంది. ఆ కారణంగా దక్షిణ కొరియాకు చెందిన ఈ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ.. సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయాలని ఎల్జీ యోచిస్తోందట. ఇదే అంశంపై తెగ ప్రచారం జరుగుతోంది. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల కోసం రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలపై ఇప్పటికే జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ ఏజీ, వియత్నాంకు చెందిన వింగ్రూప్ జేఎస్‌సి అనే రెండు సంస్థలతో ఎల్జీ చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలమవడంతో మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్నే మూసివేయాలని ఎల్జీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే.. ఈ ఏడాది తొలి అర్థ భాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ల విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఎల్జీ చేయలేదు.

మొబైల్ కమ్యూనికేషన్స్‌లో కంపెనీ నష్టాలను చవి చూస్తోందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ క్వాన్ బాంగ్ సియోక్ గత జనవరి నెలలో ప్రకటించారు. దీనిపై విధివిధాలను ఏప్రిల్ తొలివారంలో ప్రకటించడం జరుగుతుందన్నారు. గత ఐదేళ్లలో కంపెనీ 4.5 బిలియన్ల డాలర్లు(రూ.32,856 కోట్లు) కోల్పోయినట్లు ఆయన తెలిపారు. ఆ కారణంగానే మొబైల్ కమ్యూనికేషన్స్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించినట్లు బాంగ్ వెల్లడించారు. మొబైల్ ఫోన్ల తయారీపై ప్రపంచ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉన్నందున.. ఎల్జీ మంచి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు నిలిపివేసి, ఆ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగడం ఆలోచనలు చేస్తోందని ఎల్జీ కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.

Also read:

Corona Virus: కోవిడ్‌ పీచమణికే గుణాలు ఈ పదార్థంలో ఉన్నాయట.. కీలక విషయాలు చెప్పిన ఆయుర్వేద ఆస్పత్రి..

West Bengal Election 2021: బీజేపీ నిజస్వరూపం బయటపడింది.. ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ మంత్రి..