YS Jagan – Chiranjeevi: ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తి వివరాలు

కర్నూలు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి జగన్​ ప్రారంభించారు. సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. దీనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేశారు.

YS Jagan - Chiranjeevi: ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తి వివరాలు
Cm Jagan Chiru
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 25, 2021 | 3:39 PM

Uyyalawada narasimha reddy airport: కర్నూలు విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి జగన్​ ప్రారంభించారు. సభా వేదికపై జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. దీనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేశారు. కర్నూలు జిల్లా చరిత్రలో ఇది గొప్పరోజు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లులో విమానాల రాకపోకలు కొనసాగుతాయని చెప్పారు. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు సర్వీసులు ఉంటాయని వెల్లడించారు.

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేయడం పట్ల టాలీవుడ్ అగ్ర హీరో, మెగాస్టార్ చిరంజీవి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌ ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పారు. ఇది భారతదేశపు తొలి తరం స్వాంతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడకు ఇచ్చిన అతి పెద్ద నివాళి అని పేర్కొన్నారు. ఆయన పాత్రని స్క్రీన్‌పై పోషించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. కాగా చిరంజీవి ఉయ్యాలవాడ పాత్రలో నటించాలని కెరీర్ తొలినాళ్ల నుంచి కలకన్నారు. ఎట్టకేలకు 2019 లో తన కోరిక నెరవేర్చుకున్నారు. సైరా నరసింహరెడ్డి పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

కర్నూలు ఎయిర్‌పోర్ట్‌లో ఒకేసారి 4 విమానాలు పార్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని సీఎం జగన్​ తెలిపారు. ఓర్వకల్లు విమానాశ్రయం రాష్ట్రంలో ఆరోదని తెలిపారు. న్యాయ రాజధానిని మిగతా రాష్ట్రాలతో ఓర్వకల్లు కలుపుతుందని పేర్కొన్నారు. .

ఈనెల 28 నుంచి కర్నూలు విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఉడాన్‌ పథకంలో భాగంగా ఇండిగో సంస్థ సర్వీసెస్ నడపనుంది. కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖ, చెన్నైకు రెండేళ్ల పాటు ఇండిగో సంస్థ విమాన సర్వీసులు నడపనుంది. కొత్త టెక్నాలజీతో ఏటీసీ టవర్‌, టెర్మినల్‌ భవనాలు నిర్మించారు. రాత్రిళ్లు విమానాలు దిగే సమయంలో విద్యుత్తు టవర్లు గుర్తించేలా ఏర్పాట్లు చేశారు.

Also Read: DHFL: ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించి వేల కోట్లు మింగేశారు.. తీగ లాగితే కంపెనీ డొంక కదిలింది

AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో‌ ఒంటి పూట బడులు, వేసవి సెలవులు… పూర్తి షెడ్యూల్ ఇదే…