LIC SIIP Policy: రోజూ రూ. 111 చెల్లించి .. 7.08 లక్షల తీసుకోండి.. జీవిత బీమానే కాదు మరింత ఆర్ధిక భద్రత..
lic siip plan: మారుతున్న కాలంతో పాటు ఎల్‌ఐసి పథకాలు స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పథకాల సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. LIC తీసుకొచ్చిన SIIP ప్లాన్ ఆర్ధిక భద్రతను..
LIC presents New ULIP Product: “LIC” ఈ పేరు వినడంతోనే మీకు వెంటనే గుర్తుకువచ్చేది జీవిత బీమా పథకాలు. స్కీంల గురించి మీ మనస్సులో ఒక ఆలోచన ఉంటుంది. మారుతున్న కాలంతో పాటు ఎల్‌ఐసి పథకాలు స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పథకాల సౌకర్యాన్ని కూడా కొత్తగా అందిస్తోంది. LIC తీసుకొచ్చిన SIIP ప్లాన్ ఆర్ధిక భద్రతను ఇచ్చేందుకు తయారు చేసిన ప్రణాళిక . ఈ పథకంలో మీరు నెలవారీ వాయిదాలను కేవలం రూ. 3,333 జమ చేయడం ద్వారా పదేళ్లలో 7.08 లక్షల రూపాయల నిధిని పొందవచ్చు.
ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సంస్థ మీ నిధులను నాలుగు వేర్వేరు వాటిల్లో పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల మీకు 105 శాతం లాభం లభిస్తుంది. LIC యొక్క ఈ పథకాన్ని ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. LIC.. SIIP ప్రణాళిక అనేది ULIP పాలసీ.. ఇది పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇస్తుంది. మీ పాలసీ పెరిగేకొద్దీ మీ హామీ ఆదాయం శాతం కూడా పెరుగుతుంది. ఈ పథకంలో మీరు చాలా మంది రైడర్‌లను ఎన్నుకునే అవకాశాన్ని కూడా పొందుతారు.
డెత్ బెనిఫిట్: 105 శాతం నామినీకి..
ఒకవేల పాలసీ వ్యవధిలో పాలసీ హోల్డర్ మరణిస్తే కంపెనీ మొత్తం ప్రీమియంలో 105 శాతం నామినీకి ఒకే సమయంలో ఇస్తుంది. అంతే కాకుండా పాలసీ వ్యవధి ముగిసిన తరువాత కూడా 105 శాతం రాబడిని పొందుతారు. మీరు ఈ పాలసీని కనీసం 5 సంవత్సరాలు అమలు చేయాలి కొనసాగించవల్సి ఉంటుంది. 5 సంవత్సరాల తరువాత మీరు ఎప్పుడైనా మీ డబ్బును ఉపసంహరించుకోవచ్చు. అయితే ఈ ఉపసంహరణలు పాక్షికంగా ఉంటాయి.
10 సంవత్సరాల్లో…
మీరు ఈ విధానాన్ని 10 సంవత్సరాలు తీసుకున్నారని అనుకుంటే…. దీని వార్షిక విడత రూ .40,000. అంటే నెలకు సుమారు 3,333 రూపాయలు. 10 సంవత్సరాల ముగింపులో మీకు 105 శాతం హామీ రాబడి లభిస్తుంది. అంటే రూ .4.20 లక్షల వరకు మీరు లబ్ధిపొందుతారు. 10 సంవత్సరాలలో మీరు 3,333 రూపాయల ప్రకారం సుమారు 3,99,960 రూపాయలు జమ చేశారు. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసారు. ప్రస్తుత ఎన్‌ఐవి, రిటర్న్స్ ప్రకారం దానిపై మీకు 3.08,068 రూపాయల లాభం పొందుతారు. అంటే 10 సంవత్సరాల తరువాత మీకు మొత్తం రూ .7,08,028 లభిస్తుంది.
ఈ పాలసీ ప్రత్యేకతలు..
ఈ పాలసీలో చాలా ప్రత్యేక విషయం ఒకటి ఉంది. మీ మొత్తాన్ని రెట్టింపు చేయడమే కాకుండా ఇందులో మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. మధ్యలో డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యంతోపాటు మీ ఫండ్‌ను మార్చే సౌకర్యం కూడా ఉంది. క్లోజ్డ్ పాలసీని ప్రారంభించే సౌకర్యం, ప్రీ-లుక్ పీరియడ్ సౌకర్యంతోపాటు ఈ పాలసీపై రుణం పొందే అవకావం కూడా ఉంది.
LIC presents New ULIP Product on popular demand. – LIC’s SIIP . To buy online, please visit https://t.co/Hg0VnfEuwR pic.twitter.com/m5jig5nTav
— LIC India Forever (@LICIndiaForever) March 3, 2020