Dhulipalla Narendra: అవన్నీ అభూత కల్పనలే.. తప్పుడు కేసులతో ఏమీ చేయలేరు: టీడీపీ నేత ధూళిపాళ్ల
TDP Leader Dhulipalla Narendra: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల క్రయ విక్రయాలపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తదితర
TDP Leader Dhulipalla Narendra: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల క్రయ విక్రయాలపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తదితర నాయకులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు విచారణకు హాజరుకావాలంటూ చంద్రబాబుకు నోటీసులు సైతం అందించారు. దీంతో ఇటు అధికార పక్షం వైసీపీ, అటు ప్రతిపక్షం టీడీపీ నాయకుల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అధికార వైసీపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని అమరావతిలో భూముల క్రయ విక్రయాలపై తప్పుడు కేసులు పెట్టారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
అమరావతిలో రాజధాని ఉండటం ఇష్టంలేదని ధైర్యంగా చెప్పకుండా.. ముఖ్యమంత్రి జగన్ తప్పుడు కేసులు పెట్టే స్థాయికి దిగజారారంటూ తెలిపారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. రాజధానిని ఎలాగైనా తరలించాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన వీడియోలు బయటపెట్టారు. సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు, పోలీసుల ప్రమేయం కూడా ఉందంటూ ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబుపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి పెట్టిన సీఐడీ కేసులో అన్ని అభూత కల్పనలేనని స్పష్టంచేశారు. ఆర్కే ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సీలు, బాధితులు ఎవరూ లేరని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులకు మాయమాటలు చెప్పి సంతకాలు సేకరించారంటూ ఆయన పలు వీడియోలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. తప్పుడు కేసులతో ఏమీ చేయలేరంటూ ఆయన తెలిపారు.
Also Read: