Orvakal Airport: ఓర్వకల్ ఎయిర్ పోర్టును జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి జగన్..

Kurnool Airport: కర్నూల్ ప్రజల చిరకాల కోరిక గురువారంతో నెరవేరనుంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. ఈమేరకు

Orvakal Airport: ఓర్వకల్ ఎయిర్ పోర్టును జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి జగన్..
Inaugurates Orvakal Airport
Follow us

|

Updated on: Mar 25, 2021 | 1:03 PM

Kurnool Airport: కర్నూల్ ప్రజల చిరకాల కోరిక గురువారంతో నెరవేరనుంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ఎర్‌పోర్టును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. ఈమేరకు సీఎం ఉదయాన్నే ఓర్వకల్లుకు చేరుకొని ప్రారంభించారు. ఆయనతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు. ముందుగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఓర్వకల్ ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఆరో విమానాశ్రయాన్ని తొందరగా నిర్మించినట్లు ప్రకటించారు.

ఇదిలాఉంటే.. విమాన సంస్థ ఇండిగో.. ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయించింది. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం బీసీఏఎస్‌ జనవరి 27న సెక్యూరిటీ క్లియరెన్స్‌‌ను మంజూరుచేసింది. దాదాపు 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు. దాదాపు 18 నెలలోనే ప్రభుత్వం పనులను పూర్తిచేసింది.

మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడవచ్చు..

Also Read:

Paritala Sriram: పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?

వామ్మో.! పాములే పాములు.. ఒకటి కాదు రెండు కాదు కుప్పల తెప్పలుగా. చివరికి ఏమైందంటే!