వామ్మో.! పాములే పాములు.. ఒకటి కాదు రెండు కాదు కుప్పల తెప్పలుగా. చివరికి ఏమైందంటే!
Snakes Hulchul In Kurnool: ఒక్కటి కనిపిస్తేనే ఒళ్లు జలతరిస్తుంది. భయంతో గుండె జారిపోతుంది. అలాంటిది కుప్పలు కుప్పలుగా...

Snakes Hulchul In Kurnool: ఒక్కటి కనిపిస్తేనే ఒళ్లు జలతరిస్తుంది. భయంతో గుండె జారిపోతుంది. అలాంటిది కుప్పలు కుప్పలుగా…పిల్లలు తిరిగే చోట ..ఇళ్ల మధ్యలోనే ఉంటే ఎలా ఉంటుందో చెప్పనక్లర్లేదు. పాములు ఒకటి రెండు కాదు…పదుల సంఖ్యలో…కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి. పిల్లలు తిరిగే చోట…పాఠశాల తరగతి గదుల్లోనే ఇవి తలదాచుకోవడంతో…జనానికి వెన్నులో వణుకుపుడుతోంది. వివరాల్లోకి వెళ్తే..
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని STD 6వ రోడ్డులో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. హసినా అనే లెక్చరర్ ఇంటి దగ్గర్లో పాము పిల్లలు కనిపించడంతో భయంతో చుట్టుపక్కల వాళ్లకు చూపించింది. అంతే అంతా భయంతో హడలిపోయారు. కాలనీలోని పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా తిరిగే ప్రదేశం కావడంతో మొత్తం 60పాము పిల్లల్ని గుర్తించి చంపేశారు.
స్థానికంగా ఉన్న డ్రైనేజీ కాలువలు పూడిక తీయకపోవడం వల్లే పాములు నివాసంగా మార్చుకున్నాయంటున్నారు కాలనీవాసులు. ఇదే సమస్యని ఎన్నోసార్లు సచివాలయ సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు. మూడ్రోజుల క్రితం మహబూబాబాద్ అంగన్‌వాడీ కేంద్రంలోను 40పాము పిల్లలు తరగతి గదుల్లో …తిష్టవేశాయి. వాటిని గుర్తించిన స్థానికులు చంపేశారు. ఆటైమ్‌లో విద్యార్ధులు లేకపోవడంతో కొంత ప్రమాదం తప్పినట్లైంది.
Also Read:
కసితో వేటాడిన సింహం.. మెరుపు దాడి చేసిన అడవి దున్న.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
పోర్న్ చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బాలుడు.. కిమ్ ఏం శిక్ష వేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!