Scary Video: సింహంపై అడవి దున్న మెరుపు దాడి.. ప్రాణాలు కోల్పోయిన మృగరాజు.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
Lion Viral Video: మృగరాజు అయిన సింహం వేటలో బలహీనపడటం మీరు ఎప్పుడైనా చూశారా? అదేంటి అడవికి రాజు సింహం ఓడిపోవడం ఏంటని..
Lion Viral Video: మృగరాజు అయిన సింహం వేటలో బలహీనపడటం మీరు ఎప్పుడైనా చూశారా? అదేంటి అడవికి రాజు సింహం ఓడిపోవడం ఏంటని అనుకుంటున్నారా.? అవునండీ ఇది నిజం..! అడవి దున్నలతో జరిగిన పోరులో సింహం పూర్తిగా పట్టు కోల్పోయి బలహీనమైపోయింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సామాజిక మాధ్యమాల్లో తరచుగా ఎన్నో రకాల అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని ఆసక్తికరంగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా.. ఇంకొన్ని షాకింగ్‌గా ఉంటాయి. ఇక అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
అడవి దున్నలతో సింహం పోరాడుతున్నట్లుగా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. దున్న మెడను పట్టుకునేందుకు సింహం ప్రయత్నిస్తుంది. కానీ ఆ దున్న తన బలమైన కొమ్ములతో సింహంపై ఎదురుదాడికి దిగింది. దీని వల్ల సింహం కొంచెం కొంచెంగా బలహీనపడుతుండటమే కాకుండా.. దానిపై ఆ దున్న పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.
2 నిమిషాల 19 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో సింహం వేటలో అలసిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దున్నపై వేటాదేందుకు పలుమార్లు ప్రయత్నించినా.. అంతా వృధా ప్రయాసే. దున్న తన కొమ్ములతో సింహంపై ఎదురుదాడికి దిగుతూ దాన్ని పొడిచింది. ఫలితంగా సింహం రక్తమోడిన శరీరంతో నేలకు ఒరిగింది. దీనిని ఓ యూజర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా.. కొద్దిసేపటికి ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ వీడియో పాతదే అయినా.. మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!
జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!
బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…
Sometimes it also happens @WildLense_India @AnkitKumar_IFS @susantananda3 @GauravSharmaIFS @pargaien @Saket_Badola @RandeepHooda @meenakshiifs @IfsMadhu @mahesh_kar pic.twitter.com/1dIHcNxxXN
— DIKSHIT GAURAV ?? (@Gaurav_Dixit01) March 22, 2021