AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DHFL: ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించి వేల కోట్లు మింగేశారు.. తీగ లాగితే కంపెనీ డొంక కదిలింది

పేద, మద్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా..

DHFL: ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించి వేల కోట్లు మింగేశారు.. తీగ లాగితే కంపెనీ డొంక కదిలింది
Dhfl Cheating
Ram Naramaneni
|

Updated on: Mar 25, 2021 | 3:00 PM

Share

పేద, మద్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా హోమ్‌లోన్‌ తీసుకున్న లబ్ధిదారులకు తమ లోన్‌లో కొంత సబ్సిడీ లభిస్తుంది. దీన్నే అవకాశంగా మలుచుకుని ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించింది ఓ కంపెనీ.

లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఉత్తుత్తి గృహ రుణ ఖాతాలను సృష్టించి వాటిపై ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం సబ్సిడీలను మింగేసింది డీహెచ్ఎఫ్‌ఎల్ కంపెనీ. దీని ఖాతాలను ఆడిట్‌ చేయడంతో ఈ మోసం బయటపడింది. ఇందుకు సంబంధించి డీహెచ్ఎఫ్‌ఎల్ కంపెనీ, డీహెచ్ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్‌ వాధ్వాన్, ధీరజ్‌ వాధ్వాన్ తో పాటు డైరెక్టర్లపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. డీహెచ్ఎఫ్‌ఎల్ ఖాతాలను ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసిన గ్రాంట్‌ థార్న్‌టన్‌ సంస్థ ఈ మోసాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

ముంబైలోని బాంద్రాలో కల్పిత శాఖను ఏర్పాటు చేసింది డీహెచ్ఎఫ్‌ఎల్. అంతేకాదు అప్పటికే గృహ రుణాలు తీసుకుని చెల్లించేసిన రుణ ఖాతాలను ఉత్తుత్తి శాఖలోని డేటాబేస్‌లో చేర్చింది. 2007–19 మధ్య 2 లక్షల 60 వేల నకిలీ ఖాతాలను సృష్టించి 14,046 కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చూపించింది. 11,756 కోట్లను ఇలాగే దారిమళ్లించినట్టు బయటపడింది. దీంతో డీహెచ్ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్‌ వాధ్వాన్‌, ధీరజ్‌ వాధ్వాన్‌తో పాటు కంపెనీ డైరెక్టర్లపైనా కేసులు నమోదయ్యాయి. గతంలో యెస్‌ బ్యాంక్‌ స్కామ్‌లోనూ కపిల్‌ వాద్వాన్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి ఉత్తుత్తి ఖాతాలతో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా వచ్చే సబ్సిడీ కోసం ఏకంగా రెండున్నర లక్షలపైన నకిలీ ఖాతాలను సృష్టించి, సొమ్ములు మింగేయడంతో సీబీఐ ఫోకస్‌ పెట్టింది.

Also Read:  AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో‌ ఒంటి పూట బడులు, వేసవి సెలవులు… పూర్తి షెడ్యూల్ ఇదే…

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన ఉన్నత విద్యామండలి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!