Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi Festival: హోలీ పండుగ కోసం సిద్ధమవుతున్నారా ? నిపుణుల సూచనలు బ్యూటీ టిప్స్ ఇవే..

Holi Skin Care Ideas: హోలీ పండుగ సమీపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఈ వేడుకలలో పాల్గోనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరాు. అయితే ఈ హోలీ సమయంలో వాడే రంగులతో ముఖ్యంగా

Holi Festival: హోలీ పండుగ కోసం సిద్ధమవుతున్నారా ? నిపుణుల సూచనలు బ్యూటీ టిప్స్ ఇవే..
Holi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 25, 2021 | 6:29 PM

Holi Skin Care Ideas: హోలీ పండుగ సమీపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ఈ వేడుకలలో పాల్గోనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరాు. అయితే ఈ హోలీ సమయంలో వాడే రంగులతో ముఖ్యంగా చర్మ సమస్యలను ఎదుర్కునే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో, రంగులు తయారుచేయడానికి కూరగాయలు లేదంటే ఎండిన పూల నుంచి తీసిన రంగులను వాడటం లేదు. వాటికి బదులుగా సింథటిక్‌ రసాయన రంగులను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా దురద, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యలు రాకుండా.. ముందుగానే కొన్ని టిప్స్ పాటించడం వలన వీటిని నివారించవచ్చు. మరీ అవెంటో తెలుసుకుందామా..

వేప..

వేప చెట్టు ఆకులు మీ జుట్టుతోపాటు చర్మ సంరక్షణకు ఎంతగానో సహయపడతాయి. ముఖ్యంగా చర్మంపై ఎర్పడే దద్దుర్లు, ఇన్ఫెక్షన్స్ వంటివి నివారించడానికి సహయపడతాయి. ఇందుకోసం ముందుగా.. నీటని మరిగించి..అందులో వేప ఆకులను వేయాలి. అయితే వేప ఆకులను ఉడకబెట్టకూడదు. నీటిని మరిగించి.. అందులో ఈ ఆకులను వేయాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి వాటిని.. చర్మం, జుట్టు కడగడానికి ఉపయోగించాలి. అలాగే ఆ ఆకులను పేస్ట్ చేసి.. చర్మంపై, జుట్టు పై పూస్తే.. దురదను తగ్గించవచ్చు.

పసుపు..

పసుపు సహజ క్రిమినాశకి. ఇందులో శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే చర్మం పై మృదుత్వాన్ని తిరిగి పొందడానికి, టాన్ తొలగించడానికి ఇది సహయపడుతుంది. ఇందుకోసం ముందుగా 4 బాగాలు పెరుగు, ఒక భాగం తేనే, చిటికెడు పసుపు పూర్తిగా కలపాలి. హోలీ తర్వాత కొన్నిరోజులు ప్రతి రోజు మీ చేతులు, ముఖం, మెడపై రాయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే.. మృదువైన, సున్నితమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

నువ్వులు..

హోలీ సమయంలో ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఇలా కాకుండా ఉండాలంటే.. నువ్వులను తీసుకోవాలి. ముందుగా వీటిని చూర్ణం చేయాలి. దానిని రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఇది మిల్కీ లిక్విడ్ అవుతుంది. సహజమైన SPF6 రక్షణతో ఆ బాధించే వడదెబ్బను ఉపశమనం చేస్తుంది. అలాగే ముఖం, మెడ, చేతులపై దీనిని రాయాలి.

Also Read:

Yellow Watermelons : వేసవిలో దాహార్తి తీర్చడానికి వచ్చేసింది ఎల్లో పుచ్చకాయ.. ఏవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా..!