Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yellow Watermelons : వేసవిలో దాహార్తి తీర్చడానికి వచ్చేసింది ఎల్లో పుచ్చకాయ.. ఏవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా..!

వేసవి లో దాహార్తిని తీర్చే పుచ్చకాయలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. సాధారణంగా ఎండాకాలంలో విరివిగా క‌నిపించే పండ్ల‌లో పుచ్చ‌కాయ‌ ఒక‌టి. వేస‌వి తాపాన్ని త‌గ్గించి, శ‌రీరానికి ఉత్తేజాన్ని...

Yellow Watermelons : వేసవిలో దాహార్తి తీర్చడానికి వచ్చేసింది ఎల్లో పుచ్చకాయ.. ఏవి ఎక్కడ దొరుకుతాయో తెలుసా..!
Yellow Watermelons
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2021 | 2:29 PM

Yellow Watermelons : వేసవి లో దాహార్తిని తీర్చే పుచ్చకాయలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. సాధారణంగా ఎండాకాలంలో విరివిగా క‌నిపించే పండ్ల‌లో పుచ్చ‌కాయ‌ ఒక‌టి. వేస‌వి తాపాన్ని త‌గ్గించి, శ‌రీరానికి ఉత్తేజాన్ని ఇవ్వ‌డంలో వీటిని మించి మ‌రొక‌టి లేద‌నే చెప్పొచ్చు. 95 శాతం వ‌ర‌కు నీరే ఉన్న ఈ పండును తిన‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అందుకే స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే వీటికి గిరాకీ బాగుంటుంది.

ఇప్పటివరకు మనం ఎరుపురంగు పుచ్చకాయల్ని తిన్నాం.. కానీ మీరు ఎప్పుడైనా పసుపు పుచ్చకాయలను తిన్నారా? అవునండి.. ప్రస్తుతం మార్కెట్లో వీటి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఈ పసుపు పుచ్చకాయలు కర్ణాటక.. బెంగళూరు శివార్లలోని రైతులు… ప్రత్యేకంగా సాగు చేస్తారు. ఈ పుచ్చకాయలు బెంగళూరులో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఈ పసుపు పుచ్చకాయ.. పైకి పుచ్చకాయ పచ్చగానే ఉంటుంది…. దానిని కట్‌ చేసి చూస్తే ఎరుపు రంగు కాకుండా… లోపల పసుపు రంగు ఉంటోంది. అయితే ఎరుపు కాయలతో పోల్చితే… పసుపు కాయల్లో గింజలు చాలా తక్కువ, అలాగే రుచి ఎక్కువ కాబట్టి… వీటికి ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది.

ఈ పుచ్చకాయల్ని మొదటిసారి చూసిన కస్టమర్లు… వద్దొద్దు… అంటూ రెడ్ కలర్‌వే కొన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వీటిని కొనడం ప్రారంభించారు. అంతే… ఇప్పుడు వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ పుచ్చకాయల ధర తక్కువే. అందువల్ల ప్రజలు కూడా బేరాలు ఆడకుండా కొంటున్నారు. ఎరుపు రంగు పుచ్చకాయల కంటే… పసుపు రంగువు కాస్త ఎక్కువ తియ్యగా ఉంటున్నాయి. సలాడ్, జ్యూస్ చెయ్యడానికి ఇవి బాగున్నాయని ప్రజలు చెబుతున్నారు.

Also Read:  ఎండ నుంచి ఉపశమనం కోసం .. ఈ ఐదింటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.. పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ.. అదిరిపోయే బెనిఫిట్స్ .. రూ.1045తో ఎన్ని లక్షలు పొందవచ్చో తెలుసా..!