Summer Diet Tips : ఎండ నుంచి ఉపశమనం కోసం .. ఈ ఐదింటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి..

వేసవి వచ్చేసింది.. రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంది. వేడికి ఏమి తినాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది.. దీంతో శరీరాన్ని చల్ల బరచడానికి..

Summer Diet Tips : ఎండ నుంచి ఉపశమనం కోసం .. ఈ ఐదింటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి..
Summer Diet
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2021 | 12:47 PM

Summer Diet Tips : వేసవి వచ్చేసింది.. రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంది. వేడికి ఏమి తినాలన్నా ఇబ్బంది అనిపిస్తుంది.. దీంతో శరీరాన్ని చల్ల బరచడానికి.. ఉపయోగపడే ఆహారం వైపు దృష్టి సారిస్తాం.. అయితే ఈ రోజు శరీరాన్ని కూల్ గా ఉంచే త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..!

1. పెరుగు :

Summer Butter Milk

Summer Butter Milk

వేసవిలో ఈ పెరుగును మజ్జిగ రూపంలో రోజూ సేవించడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులకు మజ్జిగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. పెరుగు, మజ్జిగ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఇక పెరుగును అన్నంలో కలిపి తినవచ్చు.. లేదా రైతా గా తయారు చేసుకుని కూడా తినవచ్చు..

2. పుదీనా :

Pudina

Pudina

మండు వేసవిలో సేద దీరడానికి పుదినా చక్కటి ఔషధం. ఈ పుదినాను పచ్చడి , పానీయాలు, రైతా, ఐస్‌క్రీమ్‌లలో కూడా ఉపయోగించవచ్చు. ఈ పుదీనా తాజాదనంతో పాటు చల్లదనాన్ని ఇస్తుంది. ఆహారపదార్ధాలు మరింత రుచిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున, ఇది మీ చర్మం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తికి పెంచుతుంది. ఎండ వేడి నుంచి పుదీనా షర్బత్ మంచి ఉపశమనం కలిగిస్తుంది.

3. దోసకాయ

Summer Cucumber

Summer Cucumber

ఇది శరీరానికి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. అయితే ఎక్కువగా సలాడ్ లోనే ఉపయోగిస్తారు. ఈ దోసకాయ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మరియు అవసరమైన పోషకాలను అందించడానికి కావాల్సిన నీరు అందిస్తుంది. దోసకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, అంతేకాదు కొవ్వు అసలు ఉండదు.. కనుక దోసకాయ వేసవిలో మంచి ఆహారపదార్ధం.

4. నిమ్మకాయ నీరు

Summer Care Lemon Water,

Summer Care Lemon Water,

వేసవిలో నిమ్మకాయ నీరు మంచి స్నేహితుడు. నిమ్మకాయ నీరులో చక్కెరకు బదులుగా.. తేనె ను జోడిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. నిమ్మకాయ రసం శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపర్చడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

5. పుచ్చకాయలు

Summer Watermelon

Summer Watermelon

ఎండ వేడిని.. దాహార్తిని తీర్చడం లో పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ఇందులో 92 శాతం నీరే. పుచ్చకాయలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇక దీనిలో ఉండే పొటాషియం మూత్రవ్యవస్థను సాఫీగా సాగేలా చేస్తుంది. ఎండాకాలంలో ఉక్కపోత వల్ల స్వేదంతో పాటు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా వెలువడి విపరీతమైన దప్పిక పుడుతుంది. ఆ సమయంలో పుచ్చకాయ మంచి ఆహారం.

Also Read: మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా… నిన్న ఒక్క రోజు 3,251 మంది మృతి.. కరోనా లెక్కల జాబితాలో రెండో స్థానం

 అమ్మడి అందానికి అసలు రహస్యం ఇదేనా.. జిమ్ లో కసరత్తులతో కవ్విస్తున్న బాలీవుడ్ భామ

భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!