వామ్మో ఈ మూడు పండ్లను అస్సలు తినకండి.. తిన్నారో ఇక అంతే సంగతులు.. అసలు నిజాలు తెలుసుకోండి..
Do Not Eat These Three Fruits : ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే అందరు పండ్లు తినడం చాలా ముఖ్యం.. కానీ ఆ పండ్ల ద్వారా కూడా వ్యాధులు
Do Not Eat These Three Fruits : ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే అందరు పండ్లు తినడం చాలా ముఖ్యం.. కానీ ఆ పండ్ల ద్వారా కూడా వ్యాధులు వ్యాపిస్తున్నాయని మీకు తెలుసా.. అవును ఇది నిజం కొన్ని రకాల పండ్లు శరీరానికి చెడు చేస్తున్నాయి. అవి ఏంటో.. ఎందుకు చెడు చేస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ మధ్యలో పండ్లు, కూరగాయాలకు విపరీతంగా పురుగుమందులు కొడుతున్నారని అందరికి తెలిసిందే. అయితే ఇందులో పురుగుమందులు ఎక్కువగా కొట్టే పండ్లు, తక్కువగా కొట్టే పండ్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పురుగుమందులు రోజు కొట్టే పండ్లు కూడా ఉంటాయి. పురుగుమందులు కొట్టని పండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
సపోటాలు, అరటిపండ్లు, సీతాఫలం పండ్లకు పురుగుమందులు కొట్టరు.. ఖర్బూజ, పుచ్చకాయలకు పూత సమయంలో కొడుతారు. ఇక జామకాయకు అసలు పురుగుమందుల అవసరమే లేదు. ఇలాంటి పండ్లన్ని ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయవు.. ఇవన్ని మంచి పండ్లు.. ఇవి రోజు తీసుకోవచ్చు.. ఇక రోజు పురుగుమందులు కొట్టే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మార్కెట్లో అమ్మే మూడు రకాల పండ్లకు రెగ్యులర్‌గా పురుగుమందులు స్ప్రే చేస్తారు. వీటి విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువగా పురుగుమందులు కొట్టే పండు ద్రాక్ష. అది నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష అని తేడాలేకుండా ప్రతిరోజు స్ప్రే చేస్తారు. అందుకే వాటిని మనం చూసినపుడు వాటిపై పురుగుమందుల ఎఫెక్ట్ కూడా తెల్లగా కనిపిస్తుంది.
రెండో పండు దానిమ్మ పండు.. వీటికి కూడా రెగ్యులర్‌గా స్ప్రే చేస్తారు. ఎందుకంటే కాయ లోపల పురుగు పుట్టే గుణం ఉంటే కాయ మొత్తం కుళ్లిపోతుంది. కనుక రోజు స్ప్రే కొడుతారు. కొంతమంది పై తొక్కపైనే పురుగుమందుల అవశేషాలు ఉంటాయి అనుకుంటారు కానీ తొక్కలో నుంచి గింజల్లోకి మందు వెళ్లడం వల్లే అవి కుళ్లిపోకుండా మెరుస్తూ కనిపిస్తాయి ఇది అసలు నిజం.
ఆ తర్వాత మూడో పండు యాపిల్.. వీటికి కూడా పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా వాడాలి లేదంటే తొందరగా డ్యామేజ్ అవుతుంటాయి. చాలా రోజులు మెరుస్తూ కనిపించాలంటే చాలా వరకు స్ప్రే చేస్తూ ఉంటారు. ఈ మూడు పండ్లు ప్రతిరోజు పురుగుమందులు కొట్టే పండ్లు. అంతేకాకుండా వీటికి ధర కూడా ఎక్కువ. అందుకే వీటిని మానేసి పురుగుమందులు తక్కువగా కొట్టే పండ్లు తింటే చాలా మంచిది.
సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం… ఏప్రిల్ 6న నిధుల విడుదల