Coronavirus: మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా… నిన్న ఒక్క రోజు 3,251 మంది మృతి.. కరోనా లెక్కల జాబితాలో రెండో స్థానం

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా పడగవిప్పుతోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా.. విలయ తాండవం చేస్తోంది. అయితే బ్రెజిల్‌ దేశంలో మాత్రం...

Coronavirus: మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా... నిన్న ఒక్క రోజు 3,251 మంది మృతి.. కరోనా లెక్కల జాబితాలో రెండో స్థానం
Brazil's Corona
Follow us
Subhash Goud

|

Updated on: Mar 24, 2021 | 12:26 PM

Coronavirus: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా పడగవిప్పుతోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా.. విలయ తాండవం చేస్తోంది. అయితే బ్రెజిల్‌ దేశంలో మాత్రం కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఆ దేశ వ్యాప్తంగా రికార్డు్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. మంగళవారం ఒకే రోజు 3,251 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్కసావో నగరంలోనే 1,021 మంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు రోజువారీ కరోనా కేసులు 84 వేల కుపైగా నమోదైనట్లు బ్రెజిల్‌ ప్రభుత్వం తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం.. మొత్తం మరణాల సంఖ్య 3 లక్షలకు చేరగా, ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. అయితే కరోనా కేసులు, మరణాల్లో మొదటి స్థానంలో అమెరికా ఉంది. అయితే కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించకపోవడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు ఆ దేశ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్ఆనయి.

ఇదిలా ఉండగా, కరోనా కట్టడిలో వైఫల్యం కావడంతో ఆరోగ్యశాఖ మంత్రిని ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో తొలగించారు. కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మార్కెలో క్యూరోగాను ఆరోగ్య మంత్రిగా నియమించారు. ఆర్మీ జనరల్ ఎడ్వర్డో పజుఎల్లోకు ఎలాంటి వైద్య అనుభవం లేని వ్యక్తిని ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా రోజురోజుకు బ్రెజిల్‌లో కరోనా కేసులు, మరణాలు సంభవించడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని కరోనా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు.

కాగా, కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు వేల సంఖ్యల్లో ఉండటంతో అధికారులు రంగంలోకి దిగారు. కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నారు. మాస్కులు ధరించిని వారిపై చర్యలు చేపడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని అధికారులు కోరుతున్నారు. కేసులు ఎక్కువ అవుతుండటంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. మరోవైపు కరోనా కట్టడికి బ్రెజిల్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుపై ప్రతిపక్షలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడుతున్నారు.

TS coronavirus: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 431 మందికి పాజిటివ్, ఇద్దరు మృతి

 కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో మళ్లీ మూతపడనున్న థియేటర్లు.? ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం.!

మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా