TS coronavirus: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 431 మందికి పాజిటివ్, ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 421 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

TS coronavirus: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 431 మందికి పాజిటివ్, ఇద్దరు మృతి
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 24, 2021 | 11:57 AM

Telangana  Corona: తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 421 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. కాగా మంగళవారం కరోనాతో ఇద్దరు చనిపోయారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో విడత విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగంతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 431 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. మంగళవారం 228 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇద్దరు మరణించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి 2,99,270 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మృతుల సంఖ్య 1,676కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,352 యాక్టివ్‌ కేసులుండగా.. 1,359 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.55శాతం ఉండగా, రికవరీ రేటు 98.34శాతంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Telangana Today Corona Cases

Telangana Today Corona Cases

కరోనా కేసులు పెరుగుతుండటంతో బుధవారం నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ మూసివేస్తున్న ప్రభుత్వం మంగళవారం శాసనసభలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సినిమా థియేటర్లను సైతం మూసివేయాలని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

మరోవైపు పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, వర్తక, వాణిజ్య సంస్థల్లో భౌతిక దూరం పాటిస్తూ, ఖచ్చితమైన కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

Read Also… కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో మళ్లీ మూతపడనున్న థియేటర్లు.? ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం.!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..