Coronavirus Effect: కరోనాను ఎదుర్కోవడంలో మనమే బెటర్.. కోటి దాటినా కంట్రోల్లోనే ఇండియా
మొత్తం కరోనా కేసుల సంఖ్య, క్యూర్ అయిన వారి సంఖ్య, మృతుల సంఖ్య, ప్రస్తుతం యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఏ కోణంలో చూసినా.. ఇండియా మెరుగ్గానే కనిపిస్తోంది. ప్రస్తుత గణాంకాల ఆధారంగా..
Coronavirus effect on many countries: గత ఏడాది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇండియాలో 2020 సెప్టెంబర్ నెల నుంచి కరోనా వైరస్ తాకిడి తగ్గుతున్నట్లు కనిపించడంతో అందరూ కాస్త రిలాక్సయ్యారు. దాంతో 2021 ఫిబ్రవరి నుంచి మళ్ళీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అటు అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాలలో కరోనా కంట్రోల్ అన్నది కనిపించడమే లేదు. ఇప్పటికీ లక్షల్లో బాధితుల సంఖ్య కనిపిస్తోంది. అమెరికా అయితే అయిదున్నర లక్షల మందిని కరోనా కారణంగా కోల్పోయింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య, క్యూర్ అయిన వారి సంఖ్య, మృతుల సంఖ్య, ప్రస్తుతం యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఏ కోణంలో చూసినా.. ఇండియా మెరుగ్గానే కనిపిస్తోంది. ప్రస్తుత గణాంకాల ఆధారంగా ప్రపంచంలో కరోనా బారిన పడిన టాప్ టెన్ దేశాలు, వాటిల్లో కరోనా కేసుల వివరాలు ఓ సారి చూద్దాం..
కరోనా వైరస్ చైనా నుంచి ప్రబలినా.. అత్యంత ఘోరంగా ఎఫెక్టయ్యింది మాత్రం అగ్ర రాజ్యం అమెరికా అనే చెప్పాలి. తొలి రోజుల్లో నిర్లక్ష్యం కారణం కావచ్చు లేదా.. స్వేచ్ఛా జీవితానికి అలవాటు పడిన అమెరికన్లు లాక్‌డౌన్‌ను గట్టిగా వ్యతిరేకించడం కావచ్చు… మొత్తానికి అమెరికాపై కరోనా వైరస్ ప్రభావం గణనీయంగా కనిపించింది. అమెరికాలో గత ఏడాది కాలంగా ఏకంగా 3 కోట్ల 6 లక్షల 36 వేల 534 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 5 లక్షల 56 వేల 883 మంది మృత్యువాత పడ్డారు. 2 కోట్ల 30 లక్షల 39 వేల 585 మంది కరోనా సోకినా చికిత్స తర్వాత బయటపడ్డారు. ప్రస్తుతం కూడా 70 లక్షలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు అమెరికాలో వున్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. అందరి కంటే ముందుగానే వ్యాక్సినేషన్ ప్రారంభించినా అమెరికా కరోనాను పూర్తిస్థాయిలో కాదు కదా.. కనీస స్థాయిలో కూడా నియంత్రించలేకపోతోంది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 70 లక్షల 40 వేల 66.
ఇక కరోనా వైరస్ బారిన పడి విలవిలలాడుతున్న దేశాల జాబితాలో రెండో స్థానంలో నిలుస్తోంది దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్. అందుకే భారత దేశం వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా బ్రెజిల్‌కు పెద్ద పీట వేసింది. బ్రెజిల్ దేశంలో ఇప్పటి వరకు కోటి 21 లక్షల 36 వేల 615 మందికి కరోనా వైరస్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 2 లక్షల 98 వేల 843 మంది మరణించారు. కోటి 6 లక్షల ఒక వేయి 658 మంది కోలుకున్నారు. ప్రస్తుతం బ్రెజిల్‌లో 12 లక్షల 36 వేల 114 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులున్నాయి. అయితే మనదేశం అందించిన సహకారంతో బ్రెజిల్ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. కాకపోతే లాక్‌డౌన్ లాంటి కఠిన నిబంధనలేవీ అక్కడ లేకపోవడంతో కేసులు బాగానే నమోదు అవుతున్నాయి. ఇక కరోనా కేసుల సంఖ్యతో పోలిస్తే లభ్యమయ్యే జాబితాలో మూడో స్థానంలో మన దేశం వుంది. ఇండియాలో ఇప్పటి వరకు కోటి 17 లక్షల 34 వేల 58 మందికి కరోనా సోకింది. అందుకే లక్షా 60 వేల 441 మంది చనిపోయారు. కోటి 12 లక్షల 5 వేల 160 మంది కరోనా సోకినా కోలుకున్నారు. 3 లక్షల 68 వేల 457 మంది ప్రస్తుతం దేశంలో కరోనా సోకిన వారున్నారు. అయితే.. గత వారం రోజులుగా ఇండియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతీ రోజు 40వేలకు పైగా నమోదవుతోంది. దాంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి ఒక దశలో యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో లక్షన్నరకు పడిపోయింది. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనాని కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక ఇండియా తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశం రష్యా. ఆ దేశంలో ఇప్పటి వరకు 44 లక్షల 74 వేల 610 మందికి కరోనా సోకింది. అందులో 95 వేల 818 మందిని కరోనా కబళించింది. 40 లక్షల 88 వేల 45 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో 2 లక్షల 90 వేల 747 మంది కరోనా వైరస్ సోకి బాధపడుతున్నవారున్నారు. అయితే.. రష్యా స్పుత్నిక్ వీ పేరిట కరోనా వైరస్‌కు విరుగుడును వేగంగా వ్యాక్సిన్ రూపంలో పంపిణీ చేస్తోంది. దాంతో రష్యాలో పరిస్థితి అదుపులోకి వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ జాబితాలో కరోనా కేసుల్లో అయిదో దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్‌లో 43 లక్షల 13 వేల 73 మందికి కరోనా సోకింది. వీరిలో 92 వేల 908 మంది మరణించారు. 2 లక్షల 83 వేల 507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగానే వుంది. అమెరికా తర్వాత అత్యధికంగా కరోనా యాక్టివ్ కేసులున్న దేశం ఫ్రాన్సే. ఆ దేశంలో నేటికి 39 లక్షల 36 వేల 658 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులున్నాయి. ఆ తర్వాత స్థానంలో వున్న దేశం యూకే. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొత్తం 43 లక్షల 7 వేల 304 కరోనా కేసులు రికార్డయ్యాయి. వారిలో లక్షా 26 వేల 284 మంది కరోనాకు బలయ్యారు. 37 లక్షల 12 వేల 658 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యూకేలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షల 68 వేల 362.
యూకే తర్వాత అత్యధికంగా కేసులు నమోదై దేశం ఇటలీ. ఇటీలలో 34 లక్షల 19 వేల 616 మందికి కరోనా సోకింది. అందులో లక్షా 5 వేల 879 మంది మరణించారు. 27 లక్షల 53 వేల 83 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం ఆ దేశంలో కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేల 654. ఇటలీ తర్వాత అత్యధికంగా కేసులు నమోదైన దేశం స్పెయిన్. ఒక దశలో స్పెయిల్ కరోనా సోకిన వారు పిట్టల్లా రాలిపోయారు. ఆ దేశంలో మొత్తం 32 లక్షల 34 వేల 319 కేసులు నమోదు కాగా.. 73 వేల 744 మంది మృత్యువాత పడ్డారు. 29 లక్షల 92 వేల 848 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 67 వేల 727గా వుంది. ఆ తర్వాత టర్కీ కరోనా కేసుల్లో తొమ్మిదో స్థానంలో వుంది. టర్కీలో మొత్తం 30 లక్షల 61 వేల 520 మందికి కరోనా సోకింది. అందులో 30 వేల 316 మంది మరణించారు. 28 లక్షల 63 వేల 882 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో లక్షా 67 వేల 322 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రపంచంలో కరోనా కేసులు నమోదైన టాప్ టెన్ దేశాల్లో పదో స్థానంలో వుంది జర్మనీ. జర్మనీలో మొత్తం 26 లక్షల 89 వేల 205 మందికి కరోనా సోకింది. 75 వేల 708 మంది మరణించారు. 24 లక్షల 45 వేల 300 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో లక్షా 68 వేల 197 మంది కరోనాతో బాధపడుతున్నారు.