China Conspiracy: సరిహద్దులో కొత్త కుట్రకు డ్రాగన్ తెర.. భూమ్మీది నుంచి సముద్ర జలాల దాకా చైనా కుట్రలే కుట్రలు

మనదేశానికి పక్కలో బల్లెంలా మారేందుకు చైనా చాప కింద నీరులా కుట్ర చేస్తోంది. మనదేశంతోపాటు పొరుగునే వున్న నేపాల్, భూటాన్‌లకు చైనా దురాక్రమణ వ్యూహం భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

China Conspiracy: సరిహద్దులో కొత్త కుట్రకు డ్రాగన్ తెర.. భూమ్మీది నుంచి సముద్ర జలాల దాకా చైనా కుట్రలే కుట్రలు
China
Follow us

|

Updated on: Mar 23, 2021 | 3:31 PM

China Conspiracy irritating neighboring countries: ప్రపంచానికి కరోనా వైరస్‌ (coronavirus)ను  ఇంట్రడ్యూస్ చేసి ఓ ఏడాదంతా తల్లకిందులయ్యేలా చేసిన డ్రాగన్ కంట్రీ చైనా (China).. మనదేశంతో మంచిగా వున్నట్లు నటిస్తూనే రాజ్య విస్తరణ కాంక్షను పరోక్షంగా చాటుతోంది. లద్ధాక్‌ (Laddak) ప్రాంతంలో తిష్ట వేసి.. రెండు దేశాల మధ్య యుద్దవాతావరణాన్ని క్రియేట్ చేసిన చైనా.. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) దౌత్యనీతికి తలొగ్గి.. లద్ధాక్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుంది. కానీ.. ఇంకో మార్గంలో మనదేశానికి పక్కలో బల్లెంలా మారేందుకు చైనా చాప కింద నీరులా కుట్ర చేస్తోంది. మనదేశంతోపాటు పొరుగునే వున్న నేపాల్ (Nepal), భూటాన్ (Bhutan) ‌లకు చైనా దురాక్రమణ వ్యూహం భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

మనదేశానికి చైనాతో సుదీర్ఘ సరిహద్దు ప్రాంతం వుంది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఇటు తూర్పు కశ్మీర్ ప్రాంతంలో చైనా సరిహద్దు విస్తరించి వుంది. బ్రిటిషర్లు తమ భూభాగాన్ని ఆక్రమించి.. స్వతంత్రం ఇచ్చినపుడు ఆ భూభాగాన్ని భారత్‌కు ధారదత్తం చేశారని అంతర్జాతీయ వేదికల్లో వాదించే డ్రాగన్ కంట్రీ.. తమవి కాని ఏరియాలపై కన్నేసింది. అందుకు ఓ వైపు సైనిక కుట్రలు చేస్తూనే ఇంకోవైపు చాపకింద నీరు లాంటి మరో వ్యూహాన్ని అమలు చేస్తోంది చైనా. భారత్‌ (Bharath) మా మిత్రుడు, ప్రత్యర్ది కాదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఈ ఇటీవల ప్రకటించినా ఆ మాటలకు చేతలకు పొంతన లేదు. స్నేహంగా ఉంటామంటూనే చీటికి మాటికి భారత్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. అంతలోనే వెనక్కి తగ్గినట్లు నటిస్తోంది. ఇంకోవైపు చాపకింద నీరులా మరో కుట్రకు తెరలేపుతోంది డ్రాగన్ కంట్రీ.

భారత్‌తోపాటు నేపాల్, భూటాన్ సరిహద్దులో ఖాళీగా వున్న వేలాది ఎకరాల భూముల్లో కృత్రిమ గ్రామాలను నిర్మిస్తోంది చైనా. జనసాంద్రత అధికంగా వున్న ప్రాంతాల నుంచి ఈ కృత్రిమ గ్రామాలకు చైనీయులను తరలిస్తోంది. పాపులేషన్ డెన్సిటీని తగ్గించుకుంటామంటూనే పొరుగు దేశాలకు ఫ్యూచర్‌లో చెక్ పెట్టేందుకు చైనా కుట్రలు చేస్తోంది. ఈ మేరకు తాజాగా జపాన్ పత్రిక ఒకటి కథనాన్ని ప్రచురించింది. చైనా పైకి చెప్పేదొకటి లోపల చేసేదొకటిగా జపాన్ పత్రిక విశ్లేషించింది. ఈ కృత్రిమ గ్రామాల నిర్మాణం పేరిట మూడు దేశాల సరిహద్దుల్లో తమ యుద్ధ సన్నాహాలను కూడా అంతర్గతంగా చేస్తోందన్నది జపాన్ (Japan) పత్రిక ఇన్వెస్టిగేషన్‌లో తేలినట్లు కథనంలో పేర్కొన్నారు.

ఆక్రమణే చైనా లక్ష్యమా? యుద్ద వ్యూహాలలో భాగమా..? అసలెందుకీ సరిహద్దు ఆక్రమణలు? ఈ కృత్రిమ గ్రామాల నిర్మాణాలు. వాటిలోకి చైనీయుల తరలింపు? అయితే దీనికి విశ్లేషణలను కూడా జపాన్ పత్రిక ప్రచురించింది. ముందుగా వ్యూహాత్మక ప్రాంతాల్లో కొత్త గ్రామాల నిర్మించడం.. ఆ తర్వాత వాటిల్లోకి ప్రజలను తరలించడం.. ఇది మొదటి దశలో జరుగుతుంది. రెండవ దశలో ఈ కృత్రిమ గ్రామాలకు సమీపంలో లేదా వాటి కింద భూగర్భంలో సైనిక స్థావరాలను నిర్మించడం ఇలా ద్విముఖ వ్యూహంతో చైనా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కృత్రిమ గ్రామాల్లో ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్ స్టేషన్లు, భూగర్భ ఆయుధ బంకర్లను ఏర్పాటు చేస్తున్నారు.

సరిహద్దులలో ఇతర దేశాలకు చెందిన చిన్న చిన్న భూభాగాలను మెల్లిగా ఆక్రమించడం మొదటి దశలో చైనా కుట్ర ఇదంటున్నారు. దీనికే “సలామీ స్లైసింగ్‌” (Salami Slicing)  విధానం అని పేరుంది. సరిహద్దు దేశాల భూభాగాల ఆక్రమణకు నిరంతర కుటిల యత్నాలు చేస్తోంది చైనా. భూమిపై, సముద్రంపై కూడా కృత్రిమ నిర్మాణాలతో ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది డ్రాగన్ కంట్రీ. దౌత్య విధానాలను తుంగలో తొక్కి సైనిక బంకర్లను నిర్మించుకునే ప్రయత్నంలో చైనా వున్నట్లు సమాచారం. భారత్‌ సరిహద్దులే కాదు భూటాన్‌, నేపాల్‌ సరిహద్దుల్లోనూ చైనా కృత్రిమ గ్రామాలను నిర్మిస్తోంది. విస్తరణ వాదంతో చుట్టుపక్కల దేశాలపై దురాక్రమణ చేయాలన్నదే డ్రాగన్‌ ఆశయం అని అంటున్నారు. భారత్‌‌తో లడఖ్ పేచీ, భూటాన్‌ సరిహద్దులో గ్రామాల నిర్మాణం.. ఇంకో వైపు టిబెట్ ఆక్రమణ, నేపాల్‌లో రోడ్డు నిర్మాణం, హాంకాంగ్‌పై దురాక్రమణ లాంటి గిల్లికజ్జాలకు చైనా పాల్పడుతోంది.

హిమాలయాల సరిహద్దుల్లో ఆరు వందలకుపైగా గ్రామాలను నిర్మించాలని డ్రాగన్‌ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని 2020 నవంబర్ ఒకటిన మన దేశానికి సంబంధించిన శాటిలైట్లు బయట పెట్టాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబాన్‌సిరి జిల్లాలో త్సరిచూ నది ఒడ్డున ఓ గ్రామాన్ని చైనా ఇదివరకే నిర్మించింది. ఏకంగా అక్కడ 101 ఇళ్లను నిర్మించారు. ఇరు దేశాల సరిహద్దు నుంచి 4.5 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి నిర్మాణాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఇండియన్ ఆర్మీ (Indian Army) ఖండిస్తోంది. సరిహద్దుకు అవతల వారి భూభాగంలోనే కృత్రిమ గ్రామాల నిర్మాణాలు జరుగుతున్నాయని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. అధికారిక మ్యాప్‌ల ప్రకారం చైనా నిర్మించిన గ్రామం భారతదేశ భూభాగమేనని, దానిపై కొన్నేళ్ళుగా భారత్-చైనా మధ్య వివాదం కొనసాగుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ భూభాగం 1959 నుంచి చైనా అధీనంలో ఉంటున్నది. గతంలో ఈ ప్రాంతంలో మిలటరీ పోస్టు మాత్రమే ఏర్పాటు చేసిన చైనా.. 2020 నాటికి ఒక కొత్త ఊరినే అక్కడ నిర్మించింది. నిజానికి 2019 ఆగస్టు 26 నాటి శాటిలైట్ చిత్రాలలో త్సరిచూ నది ఒడ్డున ఎలాంటి నిర్మాణాలు లేవు.. 2020 నాటికి ఓ ఊరే కనిపిస్తోందక్కడ.

మరోవైపు భూటాన్‌లో చైనా గ్రామం నిర్మాణంపై వివాదం రాజుకుంటోంది. 2020 నవంబర్‌లో భూటాన్ భూభాగంలో 2 కి.మీ. పరిధిలో చైనా ఒక గ్రామాన్ని నిర్మించింది. ఈ గ్రామం భారత్, చైనా, భూటాన్‌ల ట్రైజంక్షన్‌కు సమీపంలోని డోక్లాంకు 9 కి.మీ.ల దూరంలో వుంది. చైనా ఏర్పాటు చేసిన ఈ గ్రామం పేరు పాంగ్డా. భూటాన్ అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని.. చైనా అక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర వివాదం కావచ్చని అంటున్నారు. కానీ దీనిని ధృవీకరించే ఆనవాళ్ళు లేకపోవడంతో ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందనేది స్పష్టత లేదు. ఈ విషయాన్ని ఫోటోలతో సహా ట్విట్టర్‌ ద్వారా బయటపెట్టారు చైనాకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్. కానీ కారణలేంటో గానీ.. కొన్ని గంటలకే ఆ ట్వీట్‌ను సదరు జర్నలిస్టు తొలగించారు. అయితే ఈలోగానే ఆ ఫోటోలను భారత్ సేకరించింది. ఆ ఫోటోలను బీజేపీకి చెందిన ఎంపీ తపిర్ గావో లోక్‌సభ ముందుంచారు.

గతంలో డోక్లాంలో చైనా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినప్పుడు భూటాన్ తరుపున భారత్‌ గట్టిగా పోరాడింది. మూడు దేశాల కూడలిగా ఉన్న డోక్లాం (Dokhlam) భూభాగాన్ని చైనా ఆక్రమించుకునే ప్రమాదం ఉందని భారత్‌ భావిస్తోంది. అప్పట్లో చైనా చర్యలను భారత్ బలంగా తిప్పి కొట్టడంతో డ్రాగన్ కంట్రీ కాస్త వెనక్కి తగ్గింది. ఇంకో వైపు మయన్మార్‌ (Myanmar)  సరిహద్దుల్లో చైనా గోడ నిర్మాణానికి పూనుకుంది. మయన్మార్ సరిహద్దులో 2 వేల కిలో మీటర్ల మేర ఇనుప గోడను నిర్మించేందుకు చైనా సిద్దమైంది. 2020 డిసెంబర్‌లో ఈ గోడ నిర్మాణం మొదలైనట్లు చెబుతున్నా వాటికి సంబంధించిన ఆధారాలు అంతర్జాతీయ సమాజానికి చేరకుండా డ్రాగన్ కంట్రీ పక్కా ఏర్పాట్లు చేసుకుంది. ఈ గోడ ఇప్పటికే 440 కి.మీ. మేరకు పూర్తి అయినట్లు సమాచారం. దీనిని 2022 నాటికి పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నది చైనా. ఈ గోడ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఫ్రీ ఆసియా రేడియో వెల్లడించింది.

దాంతో చైనా ధోరణిపై మయన్మార్ మండిపడుతోంది. 1961 ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిదని మయన్మార్‌ విదేశాంగశాఖ తెలిపింది. కరోనా సమయంలో ఇతర దేశాలనుంచి వ్యక్తులు తమ దేశంలోకి రాకుండా గోడను నిర్మిస్తున్నట్టు చైనా తన చర్యలను సమర్థించుకుంది. తిరుబాటుదారులు చైనా వదిలి వెళ్లకుండా నిర్బంధించేందుకు ఈ గోడను నిర్మిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇనుపకంచెతో కూడిన గోడ నిర్మించాలనే నిర్ణయం ఇప్పటిది కాదని… ఎన్నో ఏళ్లుగా చైనా ఈ దిశగా ఆలోచనలు చేసి అడుగు వేసినట్టు చెబుతున్నారు అంతర్జాతీయ నిపుణులు.

హిమాలయ సరిహద్దు ప్రాంతాలలో మొత్తం 624 గ్రామాలను నిర్మించాలనే లక్ష్యంతో చైనా పనిచేస్తోంది. చైనా అధికారిక పత్రాలలోని విషయాలను “సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు” (South China Morning Post) అనే పత్రిక బయటపెట్టింది. పేదరిక నిర్మూలన కార్యక్రమం పేరుతో గ్రామాల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ గ్రామాలలోకి ఎక్కువగా టిబెట్ (Tibet)  ప్రజలను, హాన్‌ చైనీయులను తరలించడం వెనుక కూడా చైనాకు మరో కుతంత్రం వున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తమ కథనంలో పేర్కొన్నది. చైనా కమ్యూనిస్టు పార్టీ తరపున అధికారిక వ్యవహారాలను చూసే వర్గం హాన్‌ చైనీయులు. సరిహద్దులలోని భూభాగాలను కొద్ది కొద్దిగా ఆక్రమించి అవి తమవే అనే ఆధారాలను సృష్టించేందుకు ఈ హాన్ వర్గీయులు అయితే బాగా ఉపయోగపడతారని చైనా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో పాటు సరిహద్దుల్లో కీలక సమాచారాన్ని సేకరించడం.. దాన్ని చైనా సైన్యానికి తెలియజేయడం .. ఒకవేళ పొరుగు దేశీయులు ఈ గూఢచర్యం చేసే వారిపై దాడులు చేస్తే.. దానిని తమ పౌరులపై విదేశీ దాడిగా చిత్రీకరించడం వంటి దురాక్రమణ వ్యూహంతో చైనా పని చేస్తోంది.

కృత్రిమ గ్రామాలే కాదు… దీవులు కూడా

ఇతర దేశాల సరిహద్దుకు చేరువలో కృత్రిమ గ్రామాలను నిర్మిస్తున్న చైనా ఇంకోవైపు 2013లో దక్షిణ చైనా సముద్రం (South China Sea) లో కృత్రిమ దీవులు నిర్మాణాన్ని కూడా చైనా చేపట్టింది. ఈ దీవులకు తమ దేశ మత్స్యకారులను కూడా పంపుతోంది డ్రాగన్‌ కంట్రీ. ఇలా మత్స్యకారులను పంపుతూ ఆ సముద్ర ప్రాంతాన్ని తమదిగా చెప్పకునే కుట్రలకు చైనా ఎనిమిదేళ్ళ క్రితమే ప్రణాళిక రచించింది. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాలలో ఘర్షణలకు సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా.

దక్షిణ చైనా సముద్రంలో కూడా ఇదే తరహా వ్యూహాన్ని చైనా అమలు చేస్తోంది. 2013 నుంచి కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. కొంత మంది మత్స్యకారులతో అక్కడ నివాసాలు ఏర్పాటు చేయిస్తోంది. వీరికి చైనా కోస్టుగార్డుతో రక్షణ కల్పిస్తోంది. చుట్టుపక్కల సముద్రం మొత్తం తమ ప్రాదేశిక జలాలుగానే వాదనను తెరమీదికి తెస్తోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్ర జలాల్లో ఆధిపత్య ఆరాటంతో డ్రాగన్ కుట్రలు చేస్తోంది. ఈ విధంగా తైవాన్, ఇండోనేషియా, మలేషియా, పిలిప్పీన్స్, వియత్నాంలతో ఘర్షణకు రంకెలు వేస్తోంది.

చైనా వ్యూహాలను నిశితంగా గమనిస్తున్నాయి అమెరికా (America), జపాన్. ఇవి చట్ట విరుద్ధమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శలు చేశారు. వివాదాస్పద జల భాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోడానికి చైనా దూకుడు ప్రదర్శిస్తోందని, అలా చేయడం తప్పు అని పాంపియో గతంలోనే కామెంట్ చేశారు. దక్షిణ సముద్రంలో ఒక పెద్ద భాగం తమదని వాదిస్తున్న చైనా.. అక్కడ మానవ నిర్మిత ద్వీపాలపై సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పాంపియో వెల్లడించడం విశేషం. ఈ ద్వీపాలు, సముద్ర శిలలు మావంటూ వాదిస్తున్న తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేసియా, వియత్నాంలకు అమెరికా అండగా వుండే అవకాశం కనిపిస్తోంది.

ALSO READ: క్రీడా మైదానాల్లో అదే నిర్లక్ష్యం.. గతంలో ఇలాంటి ఉదంతాలెన్నో..! అయినా మారని తీరు

ALSO READ: అజహర్ మెడకు మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చు.. తరుముకొస్తున్న కమలనాథులు..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో