AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసుపత్రికి వెళ్లకుండా ఇంటింటికీ వచ్చి ఎంచక్కా కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు, ఎక్కడో తెలుసా ?

ఈ కరోనా కాలంలో హాస్పిటల్స్ కో, హెల్త్ కేర్ సెంటర్లకో వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాలంటే చాలా ఆలోచించాల్సి వస్తోంది. కారణం..అవి తమ ఇళ్లకు దూరంగా ఉండడమో, లేదా అక్కడ టీకా మందు  తీసుకోవడానికి అప్పటికే...

ఆసుపత్రికి వెళ్లకుండా ఇంటింటికీ వచ్చి ఎంచక్కా కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు, ఎక్కడో తెలుసా ?
In Chennai Get Covid Vaccine At Your Door Step
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 24, 2021 | 10:53 AM

Share

ఈ కరోనా కాలంలో హాస్పిటల్స్ కో, హెల్త్ కేర్ సెంటర్లకో వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాలంటే చాలా ఆలోచించాల్సి వస్తోంది. కారణం..అవి తమ ఇళ్లకు దూరంగా ఉండడమో, లేదా అక్కడ టీకా మందు  తీసుకోవడానికి అప్పటికే చాంతాడంత క్యూలు ఉండడమో, పైగా పనులు మానుకుని ఎక్కువసేపు కూర్చోవలసి రావడమో ఇలా ఎన్నో సవా లక్ష కష్టాలుంటాయి మరి ! ముఖ్యంగా మహిళలు, వయస్సు మళ్లినవాళ్లయితే  చెప్పవలసిన పని లేదు. అసలు వాళ్ళు ఇల్లు కదలాలంటేనే ఓ మహా యజ్ఞం. అందువల్ల ఇవన్నీఎందుకని చెన్నైలోని అధికారులు ఓ వినూత్న ఐడియాకు వచ్చారు. దీని ప్రకారం హెల్త్ కేర్ వర్కర్లు ఆయా ఇళ్లకే వెళ్లి  ఇంట్లోని వాళ్లకు  వ్యాక్సిన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టారు. అంటే మన ఇంటి డోర్ స్టెప్స్ దగ్గరికే వ్యాక్సిన్ వచ్ఛేస్తుందన్న మాట ! ముఖ్యంగా వృధ్దులు, మహిళలు, 45 ఏళ్ళు పైబడిన వారు ఇక వ్యాక్సిన్ కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు.   ఈ హెల్త్ కేర్ వర్కర్స్ తో బాటు ఓ డాక్టర్ కూడా వీరి వెంట ఉంటారు. చెన్నైలో ఇప్పటివరకు  5 లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. అంటే ఇది కేవలం, 6.5 శాతం! ఈ కారణంగా చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ ఈ   సరికొత్త విధానం చేపట్టింది.

ఇలా ఇళ్లకే వచ్చి సిబ్బంది తమకు వ్యాక్సిన్ ఇస్తున్నందుకు చెన్నైవాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదాహరణకు  ఓ ఇంట్లో 95 ఏళ్ళ వృధ్ధుడు, ఆయన 85 ఏళ్ళ భార్య అయితే సంతోషం పట్టలేకపోయారు. తమలాంటి వారు వ్యాక్సిన్ కోసం ఎక్కడికి వెళ్తామని , అసలు సంవత్సర కాలంగా తాము ఇల్లు కదలలేదని వారు చెబుతున్నారు. పైగా సిబ్బంది  వెంట ఓ డాక్టర్ కూడా ఉండడం మరీ మంచిదని వారు చెప్పారు. ఇక 45 ఏళ్ల లోపు వారు కూడా ఉత్సాహంగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారని వైద్య సిబ్బంది తెలిపారు. చెన్నైలో మాదిరి దేశంలోని అన్ని నగరాల్లోనూ ఈ విధమైన పద్దతిని ప్రవేశపెడితే పోలా అంటున్నారు. మరిన్ని చదవండి ఇక్కడ : Covid :దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కరాళనృత్యం..మూతపడుతున్న స్కూల్స్.. మాల్స్ రెస్టారెంట్లపై ఆంక్షలు(వీడియో ) ‘నాకు తెలుసు సుశాంత్‌ నువ్వు ఇదంతా చూస్తున్నావని’ నవీన్ పోలిశెట్టి ఎమోషనల్‌ పోస్ట్ : Naveen Polishetty video.