Petrol Diesel Price: భారీగా తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..? మార్కెట్‌ సంస్థల నిపుణులు ఏమంటున్నారంటే..?

Petrol Diesel Rate: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అంతర్జాతీయ మార్కెట్‌ సంస్థల నుంచి. ఎందుకంటే..

Petrol Diesel Price: భారీగా తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..? మార్కెట్‌ సంస్థల నిపుణులు ఏమంటున్నారంటే..?
Petrol Diesel Price
Follow us
Subhash Goud

|

Updated on: Mar 24, 2021 | 10:48 AM

Petrol Diesel Rate: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అంతర్జాతీయ మార్కెట్‌ సంస్థల నుంచి. ఎందుకంటే క్రమంగా క్రూడాయిల్‌ ధరలు పెరిగాయంటూఐ దేశీయంగా చమురు సంస్థలు వరుసగా పెట్రో ధరలను పెంచుతూ పోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కూడా దాటిపోయింది. అయితే, నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినప్పట్టి నుంచి.. పెట్రోల్, డీజిల్‌పై రోజువారీ వడ్డింపు మాత్రం ఆగిపోయింది.. ఇదే సమయంలో.. అంతర్జాతీయ మార్కెట్‌లో గ‌త పది పదిహేను రోజుల్లోనే ముడి చ‌మురు ధ‌ర‌లు 10 శాతం మేర తగ్గిపోయాయి.. భారత్‌లో మాత్రం పెట్రో ధరలు పెరగడకుండా.. అక్కడే ఆగిపోయినా.. ప్రస్తుతం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

అయితే తాజాగా అంతర్జాతీయ మార్కెట్‌ చమురు ధరలు తగ్గడం, త‌గ్గిన ధ‌ర‌ల‌ను ఆయిల్ కంపెనీలు వినియోగ‌దారుల‌కు బ‌దిలీ చేయాల‌ని నిర్ణయిస్తే మాత్రం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగానే తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రెండు వారాల క్రితం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర 70 డాల‌ర్లుగా ఉంటే.. ఇప్పుడు అది 63.98 డాల‌ర్లకు పడిపోవడమే కారణంగా చెబుతున్నారు నిపుణులు. కానీ, పెంచేటప్పుడు మాత్రం.. అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపించిన చమురు సంస్థలు.. ఇప్పుడు ధరలు తగ్గినప్పుడు మాత్రం.. ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడంలేదు. ఇప్పటికైనా ఆ దశగా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. మరోవైపు.. కరోనా సెకండ్ వేవ్‌తో పలు దేశలు మళ్లీ లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే దాదాపు 2 రూపాయలకు పైనే తగ్గే అవకాశాలున్నాయి.

వరుస పెరుగుదలతో వాహన దారులను హడలెత్తించిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో మినహా పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 90 నుంచి రూ.100 మధ్య కొనసాగుతున్నాయి. ఇదిలాఉంటే.. బుధవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.90.99గా ఉండగా.. లీటర్‌ డీజిల్‌ రూ.81.30 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.40గా ఉండగా డీజిల్‌ రూ.88.42గా ఉంది. అలాగే చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.95గా ఉండగా.. డీజిల్‌ రూ.86.29 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.73 కాగా.. డీజిల్‌ ధర రూ. 85.93 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 88.86గా ఉంది.

ఇవీ కూడా చదవండి : Sukanya Samriddhi PPF: సుకన్య సమృద్ధి యోజన పథకం.. పీపీఎఫ్‌లలో ఏది బేటర్‌.. రెండింటిలో తేడాలు ఏమిటీ..?

Google Pay App FASTag: గూగుల్‌ పేను ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా..? సులభమైన పద్దతుల్లో.

LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

Financial Dates: మార్చి 31వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేసుకోండి.. లేదంటే ఇబ్బందుల్లో పడతారు.. అవేంటంటే..

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.