Sukanya Samriddhi PPF: సుకన్య సమృద్ధి యోజన పథకం.. పీపీఎఫ్‌ల ప్రయోజనాలు..!
Sukanya Samriddhi PPF: తల్లిదండ్రులు తమ కూతుళ్ల కోసం దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం పొదపు పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేటప్పుడు తరచుగా ఎంతో ఆందోళనకు గురవుతుంటారు. ప్రత్యేకించి..
Sukanya Samriddhi PPF: తల్లిదండ్రులు తమ కూతుళ్ల కోసం దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం పొదపు పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేటప్పుడు తరచుగా ఎంతో ఆందోళనకు గురవుతుంటారు. ప్రత్యేకించి పబ్లిక్ ప్రావిడెంట్, సుకన్య సమృద్ది యోజన పథకాల్లో దేనిలో పెట్టుబడి పెట్టాలన్న విషయమై హడావుడి అవుతుంటారు. కూతుళ్ల విద్య, వివాహం అనేవి చాలా మంది తల్లిదండ్రుల ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంటాయి. అయితే సుకన్య సమృద్ది, పీపీఎఫ్‌ల ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
ఆదాయం పన్ను మినహాయింపులకు దీర్ఘకాలిక పెట్టుబడి మార్గం ప్రజాదరణ పొందిన స్కీమ్ పీపీఎఫ్. టాక్స్ బెనిఫిట్లతో పాటు అధిక వడ్డీ ఆఫర్ చేస్తుంది. పీపీఎఫ్‌పై వచ్చే వడ్డీ, ఇతర రిటర్నులపైనా ఆదాయం పన్ను వర్తించదు. గరిష్టంగా 12 వాయిదాల్లో గానీ, ఒకేసారి గానీ భారీ మొత్తంలో పెట్టుబడి స్కీమ్ పీపీఎఫ్. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసేందుకు అనుతిస్తారు. పీపీఎఫ్ గడువు పదిహేనేళ్లు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.1 శాతం వరకు ఉంది.
సుకన్య సమృద్ది యోజన (ఎస్‌ఎస్‌వై)
సుకన్య సమృద్ది యోజన పథకాన్ని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రత్యేకించి బాలికల పొదుపు పథకంగా , దీర్ఘకాలిక పెట్టుబడి మార్గంగా అత్యంత ప్రజాదరణ పొందిన పథకం ఇది. సాధారణంగా బాలిక పుట్టినప్పటి నుంచి 10 ఏళ్ల వరకు ఈ పథకంలో చేరవచ్చు. అయితే బాలిక తప్పనిసరిగా భారతీయురాలై ఉండాలి.18 ఏళ్లు దాటిన తర్వాత సదరు బాలిక ఖాతాదారు అవుతుంది. ఆమె కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఒక ఏడాదిలో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రారంభంలో ఈ పథకంలో పెట్టుబడిపై 8.4 శాతం వడ్డీరేటు ఆఫర్ చేయగా, ఇప్పుడు 7.6 శాతానికి కుదించారు.
సుకన్య సమృద్ది, పీపీఎఫ్‌తో పోలిస్తే పీపీఎఫ్ కంటే సుకన్య సమృద్ది పథకానికి ఎక్కువ వడ్డీరేటు లభిస్తుంది. పీపీఎఫ్‌తో పోలిస్తే భవిష్యత్తులో వడ్డీరేటు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. బాలిక భవిష్యత్తును పరిగణలోకి తీసుకుని డెట్ ఫండ్‌లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. పీపీఎఫ్ ఇన్వెస్ట్ మెంట్ కూడా మంచిదే. బాలిక 21 ఏళ్లు దాటిన తర్వాత సుకన్య పథకం నిలిపివేయబడుతుంది. పీపీఎఫ్ 15 ఏళ్లకు మెచ్యూర్ అయినా, మరో ఐదేళ్లు కొనసాగించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఏదో ఒక పథకంలో పెట్టుబడి పెట్టడానికి తరుచుగా ప్రయత్నిస్తుంటారు. నిపుణులు మాత్రం ఒకే పథకంలో పెట్టుబడి పెట్టవద్దని సూచిస్తున్నారు. చిన్న మొత్తాలు పీపీఎఫ్‌లోనూ ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్య లభ్యతకు పీపీఎఫ్ ఆఫర్ చేస్తుంది. అయితే సుకన్య సమృద్దిలో 15 సంవత్సరాలు దాటిన తర్వాత పెట్టుబడులు అనుమతించరు. 21 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. 18 ఏళ్ల తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ రెండు పథకాలకూ ఆదాయం పన్ను చట్టం 80 సీ సెక్షన్ కింద మినహాయింపు లభిస్తుంది.
ఇవీ కూడా చదవండి :
LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..