Postal Life Insurance : పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ.. అదిరిపోయే బెనిఫిట్స్ .. రూ.1045తో ఎన్ని లక్షలు పొందవచ్చో తెలుసా..!

  వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ ఎన్నో ఆకర్షణీయమైన పథకాలను అందుబాటులోకి తీస్తుంది, అయితే కొన్ని పథకాలు ఎప్పటినుంచో ఉన్నా సరే.. వినియోగదారులకు...

Postal Life Insurance : పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ.. అదిరిపోయే బెనిఫిట్స్ ..  రూ.1045తో  ఎన్ని లక్షలు పొందవచ్చో తెలుసా..!
గ్రామ సుమంగళ్ మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీ. దీని గరిష్ట మొత్తం.10 లక్షలు. మీకు మనీ బ్యాక్ కూడా లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తి సజీవంగా ఉన్నంత వరకు ఎప్పటికప్పుడు మనీబ్యాక్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒకవేళ మరణిస్తే బీమా చేసిన నామినీకి మొత్తం బోనస్, క్లెయిమ్ లభిస్తుంది. ఈ పాలసీ ప్రకారం.. నెలకు రూ.2850 చొప్పున ప్రీమియం జమ చేస్తే.. 20 సంవత్సరాల తరువాత సుమారు రూ.14 లక్షలు అందుతాయి.
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Mar 25, 2021 | 8:51 PM

Postal Life Insurance :  వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ ఎన్నో ఆకర్షణీయమైన పథకాలను అందుబాటులోకి తీస్తుంది, అయితే కొన్ని పథకాలు ఎప్పటినుంచో ఉన్నా సరే.. వినియోగదారులకు సరైన ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో వాటిపై దృష్టి పెట్టడం లేదు.. అటువంటి ఒక మంచి పథకం .. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్‌పీఎల్ఐ). దీనిని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదప్రజలు దృష్టి లో ఉంచుకుని 1995 లో అందుబాటులోకి తీసుకుని వచ్చారు..

ఈ పాలసీని 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు వారు తీసుకోవచ్చు. కనిష్టంగా రూ.10వేలను గరిష్టంగా రూ.10 లక్షలను ఇందులో పొదుపు చేయవచ్చు. పాలసీ 4 ఏళ్లు అయ్యాక లోను సదుపాయం అందిస్తారు. అయితే 5 ఏళ్ల లోపు ఉపసంహరించుకుంటే మాత్రం బోనస్ ఇవ్వరు.. ఈ పథకంలో చేరిన పాలసీదారుడు డబ్బును పొదుపు చేసుకుంటే అతనికి 80 ఏళ్ల వయస్సు వచ్చాక పాలసీ మెచూర్ అవుతుంది. అయితే పాలసీదారుడు మరణిస్తే ఆ మెచూరిటీ మొత్తం అతని నామినీకి అందుతుంది.

ఈ పథకంలో చేరేందుకు అవసరం అయితే వయస్సును 50, 55, 58, 60 ఏళ్ల వరకు పొడిగిస్తారు. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు పాలసీ తీసుకుంటే 60 ఏళ్ల వరకు పాలసీ కట్టవచ్చు. అయితే ఈ ఆర్‌పీఎల్ఐ స్కీమ్ కింద 30 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల వరకు ప్రీమియం కడితే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అనుకుంటే నెలకు రూ.1045 ప్రీమియం కట్టాలి. మొత్తం 30 ఏళ్లకు రూ.9 లక్షల బోనస్ ఇస్తారు. దీంతో అసలు రూ.5 లక్షలు, బోనస్ రూ.9 లక్షలు కలిపి రూ.14 లక్షలు చెల్లిస్తారు. ఈ క్రమంలో రూ.1000కి రూ.60 బోనస్ ఇస్తారు. అంటే రూ.1 లక్షకు రూ.6వేలు బోనస్ లభిస్తుంది. అదే రూ.5 లక్షలకు అయితే రూ.30వేలు ఇస్తారు.

Also Read: బుల్లి తెరపై బాలీవుడ్ సీనియర్ బ్యూటీలతో సందడి చేయనున్న మాధురీ దీక్షిత్ ..

సారంగదారియా పాటకు స్టెప్పులేసి యూట్యూబ్ స్టార్.. అమ్మడి డ్యాన్స్ కు సోషల్ మీడియా షేక్

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం… ఏప్రిల్ 6న నిధుల విడుదల