AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Deewane Special Episode :బుల్లి తెరపై బాలీవుడ్ సీనియర్ బ్యూటీలతో సందడి చేయనున్న మాధురీ దీక్షిత్ ..

బాలీవుడ్ సీనియర్ నటీమణలు బుల్లి తెరపై సందడి చేయనున్నారు. సీనియర్ నటీమణులైన వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, హెలెన్ లతో మాధురీ దీక్షిత్‌లు ఒకే స్టేజ్ పై కనిపించనున్నారు. అద్భుతమైన దృశ్యం డాన్స్ దివానే ప్రీమియర్ స్పెషల్ ఎపిసోడ్ వేదిక అయ్యింది...

Dance Deewane Special Episode :బుల్లి తెరపై బాలీవుడ్ సీనియర్ బ్యూటీలతో సందడి చేయనున్న మాధురీ దీక్షిత్ ..
Madhuri Dixit
Surya Kala
|

Updated on: Mar 24, 2021 | 1:26 PM

Share

Dance Deewane Special Episode :బాలీవుడ్ ముగ్గురు వెటరన్ బ్యూటీలు వహీదా రెహ్మాన్, హెలెన్ మరియు ఆశా పరేఖ్ త్వరలో బుల్లి తెరపై సందడి చేయనున్నారు. డాన్స్ దీవానే 3 రియాల్టీ షోకి న్యాయమూర్తులుగా వ్యవహరించనున్నారు. అయితే వీరితో పాటు మాధురి దీక్షిత్, తుషార్ కలియా, ధర్మేష్ షోకి మరింత అందాన్ని తీసుకుని రానున్నారు. అయితే మాధురి తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ముగ్గురు సీనియర్ తారలతో చేసిన డ్యాన్స్ వీడియోలను షేర్ చేసింది.

1970 లో రిలీజైన ఆన్ మీలో సజ్నా మూవీ సాంగ్.. ఆచా తో హమ్ చల్తే హైన్ ఈ పాటను ఆశా పరేఖ్ , రాజేష్ ఖన్నాలపై చిత్రీకరించారు. తాజాగా ఈ పాటకు ఆశా తో కలిసి మాధురీ దీక్షిత్ భావ వ్యక్తీకరణ చేసింది. తన ఫేస్ కదలికలతోనే పాటకు అర్ధాన్ని ఇస్తూ.. మాధురి అందరినీ మెస్మరైజ్ చేసింది.

అలనాటి అందాల నాట్యతార హెలెన్ తో మాధురి “ముంగ్డా” లో కూడా నృత్యం చేశారు. ఈ సాంగ్ లో అలనాటి బాలీవుడ్ స్వర్ణ యుగాన్ని మళ్ళీ ప్రేక్షకులను గుర్తు చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో మాధురి షేర్ చేసిన చివరి వీడియోలో అలనాటి అందాల తార వహీదా రెహ్మాన్ తో కలిసి పాన్ ఖై సైయాన్ హుమారో సాంగ్ కు మాధురి అద్భుతమైన హావభావాలతో ప్రదర్శన ఇచ్చింది. వహీదా, మాధురీ ఇద్దరూ శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు.. దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ తో సాంగ్ అద్భుతం అనిపించింది. తమ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు.

డాన్స్ దీవానే రియాల్టీ షో డ్యాన్స్ ని ఇష్టపడే వారికి ఒక వేదిక. ఈ షో మూడు తరాలుగా విభించారు. మొదటి గ్రూప్ లో 15 ఏళ్ల లోపు వారు.. రెండవ గ్రూప్ లో 30 ఏళ్ల లోపు వారు .. 35 ఏళ్ళు పైబడినవారు ఒక గ్రూప్ గా ను పోటీ పడనున్నారు.

ఫార్మాట్ గురించి తుషార్ కాలియా మాట్లాడుతూ.. “మూడు తరాలు కలిసి పోటీ పడుతున్నారు.. అన్ని గ్రూపుల విజేతలు అంతిమ ఛాంపియన్‌షిప్ కోసం ఫైనల్‌లో పోరాడతారని తెలిపారు.

Summer Diet Tips : ఎండ నుంచి ఉపశమనం కోసం .. ఈ ఐదింటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి..