Karthika Deepam: చెప్పుడు మాటలు వినను.. నా నమ్మకం నాకుంది అన్న కార్తీక్.. నీ నమ్మకానికి నేను అండగా ఉంటానన్న సౌందర్య

నేను చెప్పుడు మాటలు వింటానని ఎలా డిసైడ్ చేశావు.. నా నమ్మకం నాకుంది.. నాకు ఎవరు చెప్పినా వినను.. నా జడ్జిమెంట్ నాకుంది.. ఇప్పుడు వాళ్ళని వెదకాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది....

Karthika Deepam: చెప్పుడు మాటలు వినను.. నా నమ్మకం నాకుంది అన్న కార్తీక్.. నీ నమ్మకానికి నేను అండగా ఉంటానన్న సౌందర్య
Kathika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Mar 26, 2021 | 9:48 AM

Karthika Deepam Serial: కార్తీక దీపం తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. రోజు రోజుకీ ట్విస్ట్స్ మీద ట్విస్ట్స్ తో ఆసక్తిని కలిగిస్తూ.. టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఈరోజు మార్చి 25న 996 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ చూద్దాం..!

దీప ఇడ్లి బండి దగ్గర తండ్రిని వెదుకుతుంది. ఇంతలో మురళీకృష్ణ పిండి రుబ్బుతుంటాడు. చెయ్యిలాగడం, పిండి రుబ్బడం రెండు అలవాటు అయిపోతాయి.. నేను కూడా నాన్న టిఫిన్ సెంటర్ లో ఓ ఎంప్లాయినీ ని అంటాడు. అమ్మే ఉంటె నేను ఎంత చదువుకుంటానంటే.. అంత చదివించేది.. అమ్మపోయిన తర్వాత పిన్ని ని చేసుకున్నావు.. తను నన్ను బాగా చూడకుండా.. చదువు మానిపించి వంట నేర్పింది. అది కూడా ఈరోజు నాకు మంచే చేసింది. నా పిల్లలని పోషించుకోవడానికి దీప వంటలక్కగా అయ్యింది. నా కాళ్ళమీద నేను నిలబడడానికి మార్గం దొరికింది. అంటుంది దీప. నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అంటాడు మురళీ కృష్ణ.. నిరాశ లో నుంచి కూడా ఆశని వెదుకుకుంటున్నావు ప్రశంసిస్తాడు.. ఇక ఇప్పుడు కనుక డాక్టర్ బాబు చూస్తే .. ఏముంది నన్ను చెంపమీద కొట్టి.. నీ చావు నువ్వు చావు పిల్లల్ని మాత్రం కష్టపెట్టడానికి   వీలులు లేదు అని పిల్లని తీసుకుని వెళ్ళిపోతారు దేశోద్ధారకుడు అని అంటుంది దీప..

మరోవైపు మోనిత .. కోపం తో ఊగిపోతూ.. దీప మురళీకృష్ణ కలుసుకున్నది గుర్తు తెచ్చుకుంటుంది. ఇంతలో పనిమనిషి ప్రియమణి వచ్చి హిమ ఏది అంటూ.. కార్తీక్, మోనిత పెళ్లి గురించి మాట్లాడుతుంది. ఏమైంది.. వెళ్లిన పని కాయా.. పండా అని అడుగుతుంది ప్రియమణి.. దీంతో మోనిత పుచ్చు అంటూ.. వెళ్లి కాఫీ పెట్టు అంటుంది. వాష్ రూమ్ లో టవల్ పెట్టు.. గ్రీజర్ ఆన్ చేసి పెట్టు అంటుంది మోనిత. అంతకోపంగా ఎందుకు ఉన్నారు.. ఏమైంది అంటుంది ప్రియమణి.. ఖరీదైన ప్లవర్ వాజ్.. మీ బొంద అయ్యిందని దాని బొంద పెడతారా అని ప్రశ్నిస్తుంది ప్రియమణి.. కోపం తగ్గించుకోండి అని అంటుంది.. మోనిత వెళ్ళు అని అంటే.. ఇంట్లోకా బయటకా అంటుంది ప్రియమణి..

దీప కనిపించింది అని చెబితే.. కార్తీక్ ఎం చేస్తాడు అని ఆలోచిస్తుంది.. కార్తీక్ కచ్చితంగా పిల్లని తెచ్చుకుంటాడు.. నన్ను మరచిపోతాడు.. అందుకని దీప గురించి కార్తీక్ కు చెప్పను.. వాళ్ళకి దూరంగా ఉంటె వాళ్ళను మరచిపోతాడు. నేను చెప్పను.. చెప్పలేను.. నేను చెప్పను సరే.. అమ్మా దీప మురళీ కృష్ణ…  దీప ఆచూకీ చెబితే అని ఆలోచిస్తుంది.. అయిపోయింది.. అంత అయిపొయింది అనుకుంటుంది మోనిత

ఇంతలో సౌందర్య ఇంట్లోకి అడుగు పెడుతుంది.. శ్రావ్య .. ఏమైంది.. అత్తయ్య.. మా ఇంటికి వెళ్ళారా..? నాన్న అమ్మకి ఫోన్ చేశారా..? ఏమైంది అత్తయ్య.. మాట్లాడడం లేదు ఏమిటి..? అని అడుగుతుంది. సౌందర్య.. ఫస్ట్ టైం.. లైఫ్ లో ఫస్ట్ టైం.. మీ అమ్మ దీప కన్నతల్లిలా మాట్లాడింది.. అంటుంది నన్నే నోరు మూయించింది.. ప్రపంచం అడగాల్సిన ప్రశ్నలను అడిగింది.. నేను జవాబు చెప్పలేని ప్రశ్నలు .. అవన్నీ వైద్య విజ్ఞాన ఖని దేశోద్ధారకుడు కార్తీక్ విని ఉంటె బాగుండేది అనిపించింది. భాగ్యానికి నోరు వచ్చింది.. మా అమ్మ మాటలు పట్టించుకోకండి అత్తయ్య.. అంటుంది శ్రావ్య.. లేదు పట్టించుకోవాల్సిన మాటలే అంది మీ అమ్మ.. అంటుంది సౌందర్య.

ఇంతలో కార్తీక్ ఇంటికి వచ్చి.. డాడీ ఏడి అమ్మా అంటాడు. దీంతో సౌందర్య .. కార్తీక్ పై కోపంతో విరుచుకుపడుతుంది. డైరెక్ట్ గా వెళ్లి అడగలేవు .,. ఎవరో మూడో వ్యక్తి వచ్చి చెప్పాలి అంటుంది..దీంతో అర్ధమైంది నువ్వు కూడా వింటుంది చెప్పుడు మాటలే అంటాను అంటాడు కార్తీక్..

ఇంతలో ఆనందరావు వస్తాడు.. మీ ఇద్దరిని కలిపి అడుగుతాను.. మనసు నుంచి సమాధానం చెప్పాలి అంటాడు.. మీ మనసు నమ్మిందే నిజం.. అదే న్యాయం .. కనుక మనసుని అడిగి నిజం చెప్పండి.. అంటాడు కార్తీక్ ..

ఆరోజు నాకు తులసి గురించి చెప్పింది. నేను తులసి గురించి నమ్మను.. అన్నాను.. అయితే దీపని ఊరు వదిలి వెళ్ళిపోమన్నానా.. పిల్లని తీసుకుని వెళ్ళపోమన్నానా అంటాడు కార్తీక్.. మరి అది నిర్ధాక్షిణ్యంగా పిల్లని నా నుంచి తీసుకుని వెళ్ళిపోయింది.. అప్పుడు మీరు ఎందుకు ఆపలేదు.. మీ మనవరాలు అంటారు కదా.. మీరు ఆపేరా..? తెల్లారి లేస్తే.. మా కోడలు నిప్పు.. మండే జ్వాలా అంటారు.. ఇప్పుడు పిల్లని తీసుకుని ఏటో వెళ్ళిపోయింది పిల్లని తీసుకుని వెళ్ళిపోయిన దీప గురించి పేపర్ లో ప్రకటన ఇస్తే.. ఇప్పుడు పోయేది ఎవరి పరువు..? మనది కదా..? అని ప్రశ్నిస్తాడు కార్తీక్.. నేను నాలుగుగోడలు మధ్య మాట్లాడా.. అది నాలుగు గోడలు మధ్య కాదు.. కుటుంబ పరువు వీధిని పడేసింది.

అవును మేము ఆపలేదు.. దీప పిల్లని తీసుకుని వెళ్తుంటే.. ఆపలేదు.. చేతులు కట్టేసుకున్నాం.. అది వెళుతుంటే శిలాప్రతిమల్లా చేష్టలుడిపోయి చూస్తూ నిల్చున్నాం.. మరి నువ్వెందుకు ఆపలేదు.. నా కోడలు అక్కర్లేదు.. మరి వాళ్ళు,,,  నీ కూతుళ్ళని నువ్వు నమ్మినా నమ్మక పోయినా నీకు పిల్లల మీద తండ్రి ప్రేమ ఉంది కదా.. నీతో పాటు నా పిల్లలని కష్టపెట్టే హక్కు లేదు.. వారికీ ఉజ్వల భవిష్యత్ ఇస్తా అని ఎందుకు అనలేదని .. పిల్లని ఎందుకు లాక్కోలేదు అని ప్రశ్నిస్తుంది సౌందర్య..

దీనికి కార్తీక్ నేను ఆలా చేస్తే.. సో కాల్డ్ పవిత్ర మూర్తి నీ కోడలు దీప ఏమంటుందో తెలుసా..? వీళ్ళని మీరు కనలేదు అంటున్నారు కదా..? ఏహక్కుతో అడుగుతున్నారు అంటుంది.. అప్పుడు దాని చరిత్ర చదివి.. పిల్లల ముందు ఇవన్నీ మాట్లాడాలా.. అంటాడు మీరు నేర్పిన విధ్యే మీరు సంస్కారం నన్ను ఆపింది.. నేనే పెద్ద తప్పుచేసాను.. ఏనాడో విడాకులు ఇవ్వాల్సింది.. ఈరోజు నాకు నరకం ఉండేది కాదు.. అంటాడు. డాడీ నేను మిమ్మల్ని పట్టించుకోను అన్నట్లు మాట్లాడింది .. అమ్మ.. నేను చెప్పుడు మాటలు వింటానని ఎలా డిసైడ్ చేశావు.. నా నమ్మకం నాకుంది.. నాకు ఎవరు చెప్పినా వినను.. నా జడ్జిమెంట్ నాకుంది.. ఇప్పుడు వాళ్ళని వెదకాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది..

నేనా.. మీరా.. ఆ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళా .. మీ కోడలే కదా..? మన పరువు బజారుని పెట్టిపోయింది ఎవరు..? అది మీ కోడలు కదా..? ముందు దానిని తిట్టండి..  నీ మీద నాకు ప్రేమ లేక కాదు.. మా కోడలని వెనకేసి వచ్చే కొడుకు ని శత్రులా చూడాలనే దురుద్దేశ్యం మాకు లేదు అంటుంది.. సౌందర్య.. నీ నమ్మకం నిజమైతే.. నేను నమ్ముతాను.. నీ నమ్మకాన్ని గౌరవిస్తాను.. ప్రపంచం అంతా వ్యతిరేకించినా.. నేను నీవైపే నిలబెడతాను.. పెద్దోడా అంటుంది సౌందర్య. నేను ప్రామిస్ చేస్తున్న అంటుంది సౌందర్య.

ఇంతలో మోనిత కార్తీక్ కి ఫోన్ చేస్తుంది.. చెప్పు మోనిత హిమనీ తీసుకొచ్చావా..? వాళ్ళ అమ్మ ఒప్పుకుందా..? హిమ ఏమన్నదీ..? అని ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తాడు.. ఒక్క గంటముందు నేను దీపని చూసిఉంటే నా పెళ్లి కార్తీక్ తో జరిగిపోయేది అనుకుంటుంది. దీప గురించి నాకు వచ్చిన ఇన్ ఫర్మేషన్ తప్పు.. నేను వెళ్లిన ఊరులో దీప లేదు అంటుంది.. నువ్వు తీసుకొస్తావన్న నమ్మకంతో ఉన్నాను అంటాడు కార్తీక్.. దీంతో మోనిత నా ఖర్మ కార్తీక్.. నా కర్మ అంటుంది.. సర్లే నేను రేపు వస్తాను అంటాడు కార్తీక్.

మరోవైపు మురళీకృష్ణ దీపని ఎలా పిలుస్తాడో శౌర్య, హిమలు అనుసరిస్తూ.. సరదాగా నవ్వుతారు.. మరి రేపటి ఎపిసోడ్ లో మోనిత ని కార్తీక్ పెళ్లి చేసుకుంటా..  అంటాడా.. రిజల్ట్ వస్తే మోనిత రియాక్షన్ ఏమిటి.. చూడాలి మరి

Also Read:  చరణ్ పుటిన రోజున సోషల్ మీడియాను షేక్ చేయడానికి సిద్దమవుతున్న ఫ్యాన్స్..

రూ.15 వేలలోపు స్మార్ట్‌ఫోన్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే ఓసారి వీటిపై లుక్కేయండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..