AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vignesh Shivan-Nayanthara: విమర్శకులకు సైలెంట్‌‌‌‌‌‌గా సమాధానం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. ఎంగేజ్మెంట్ అయిపోయిందా..?

తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార. అద్భుతమైన అభినయం.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగలగడం ఆమెకు మాత్రమే సాధ్యం.

Vignesh Shivan-Nayanthara: విమర్శకులకు సైలెంట్‌‌‌‌‌‌గా సమాధానం చెప్పిన లేడీ సూపర్ స్టార్.. ఎంగేజ్మెంట్ అయిపోయిందా..?
Nayan
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2021 | 11:03 AM

Share

Vignesh Shivan-Nayanthara: తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార. అద్భుతమైన అభినయం.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోగలగడం ఆమెకు మాత్రమే సాధ్యం. నాలుగు పదుల వయసుకు చేరువలో ఉన్నా ఏ మాత్రం తగ్గని అందం ఆమె సొంతం. ఆమె లేడి సూపర్‌స్టార్‌కు అచ్చమైన నిర్వచనం. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయనతార పెళ్లిపై ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అదిగో పెళ్లి. ఇదిగో ఎంగేజ్మెంట్ అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

సౌత్ ఇండియన్ క్రేజీ జోడీ నయనతార, విఘ్నేష్‌ శివన్ ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు చట్టపట్టాలేసుకుంటూ తిరుగుతూ నిత్యం మీడియా కంట పడుతూనే ఉన్నారు. కెరీర్ ఆరంభంలోనే శింబుతో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకు తిరిగింది. ఆ ఇద్దరితో కట్ చేసుకున్నాక యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్ ఎఫ్ఫైర్ స్టార్ట్ చేసింది నయన్. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ ఫుల్లుగా ప్రేమలో మునిగితేలుతూ డేటింగ్‌ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ అయ్యిందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనికి కారణం విఘ్నేష్‌ శివన్ తాజా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఈఫోటోలో నయన్ విఘ్నేష్‌ శివన్ గుండెపై చేయి వేసి ఉండగా ఆమె చేతికి ఉన్న రింగ్ హైలైట్ అవుతూ కనిపించింది. దాంతో ఈ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యిందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయం పైన త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Karthika Deepam: చెప్పుడు మాటలు వినను.. నా నమ్మకం నాకుంది అన్న కార్తీక్.. నీ నమ్మకానికి నేను అండగా ఉంటానన్న సౌందర్య

Ram Charan : చరణ్ పుటిన రోజున సోషల్ మీడియాను షేక్ చేయడానికి సిద్దమవుతున్న ఫ్యాన్స్..

Rahul Ravindran: మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న నాగార్జున డైరెక్టర్.. ఆ రీమేక్ లో ఛాన్స్..