Karthika Deepam : దీప తరపున మాట్లాడిన భాగ్యం.. మీ అబ్బాయి చెప్పుడు మాటలు విన్నంత కాలం.. ఆ దేవుడు కూడా మార్చలేడు..

కార్తీక దీపం సీరియల్ మార్చి 24న 995 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. దాదాపు వెయ్యి ఎపిసోడ్స్ కు దగ్గరలో ఉన్నా నేటికీ కార్తీక దీపం తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ...

Karthika Deepam : దీప తరపున మాట్లాడిన భాగ్యం.. మీ అబ్బాయి చెప్పుడు మాటలు విన్నంత కాలం.. ఆ దేవుడు కూడా మార్చలేడు..
Karthika Deepam March 24th
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2021 | 10:33 AM

Karthika Deepam :  కార్తీక దీపం సీరియల్ మార్చి 24న 995 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. దాదాపు వెయ్యి ఎపిసోడ్స్ కు దగ్గరలో ఉన్నా నేటికీ కార్తీక దీపం తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంటూనే ఉంది. రోజు రోజుకీ ట్విస్ట్స్ మీద ట్విస్ట్స్ తో ఆసక్తిని కలిగిస్తూ.. టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో హైలెట్స్ చూద్దాం..!

మురళీ కృష్ణ తన కూతురు దీప జాడకనుకుంటాడు. ఇంటికి రమ్మనమని పిలుస్తాడు.. నువ్వు ఏమిటి..? నీకు ఈ అవసరం ఏమిటి అని దీపని ప్రశ్నిస్తాడు. దీప బతకడానికి బండి.. వంటలక్కని కదా అంటుంది.. నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు.. అని అడుగు తుంది.. మీ అత్తగారు డబ్బులిచ్చి నిన్ను వెదకమన్నారు.. అలా వెదుకుతూ.. నీ దగ్గరకు చేరుకున్నా అంటుంది.

నీ ఇంటికి రా అని అడుగుతాడు దీపని.. నీకు పుట్టినిల్లు ఉంది.. మెట్టినిల్లు ఉంది.. అక్కడికి రా.. అంటాడు మురళీ కృష్ణ.. అందరు లిస్ట్ లో మా ఆయన ఉన్నాడా లేడు కదా..? పదేళ్ల క్రితమే ను ఒంటరిని ఐపోయాను… ఇప్పుడు పుట్టింటికి రావడం కరెక్ట్ కాదు.. అది నా అత్తింటికి గౌరవం కాదు.. పుట్టింటికి గౌరవం కాదు నేను రాను అంటుంది దీప.. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నా… కరెక్ట్ కాదు కదా.. అని మురళీ కృష్ణ అంటే.. ఎమౌంతుంది.. భర్తని వదిలేసిందని అంటున్నాడు.. అది నా వరకే పరిమితం అవుతుంది.. నా కష్టాలు చూసి అయినా సానుభూతి పడతారు.. అల్లుడు ఏమైపోయినా ఫర్వాలేదా.. అయన ఏమౌతారు.. అయన కోరుకున్నదేగా జరిగింది.. ఇంట్లో ఉన్నా ఊళ్ళో ఉన్నా అవసరం లేదు.. పిల్లల కోసం తల్లడిల్లు పోతున్నాడు.. .. అమ్మా అంటాడు.. అయితే పిల్లలకోసం టెస్టులు చేయించుకున్నాడా..? లేదే..? పిల్లల్ని ఇస్తే అనాథపిల్లల్ని పెంచుకుతున్నట్లు పెంచుకుంటాడు..

దయచేసి నన్ను వెనక్కి రమన్నామని అడగవొద్దు.. నేను ఎక్కడికి రాను అని చెబుతుంది.. ఇంతలో సౌందర్య ఫోన్ చేస్తుంది.. ఆమెకు నేను కనిపించానని చెబితే ఎప్పటికీ కనిపించను అంటుంది దీప.. దీంతో మురళీ కృష్ణ సౌందర్య ఫోన్ ఎత్తి .. దీప ఇంకా కన్పించలేదు.. ఇక దొరుకుతుందనే ఆశ కూడా లేదు అంటాడు

దీంతో సౌందర్యకు అనుమానం వచ్చి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కనిపించిందా.. నాకు చెప్పొద్దూ అందా అని అడుగుతుంది. మురళీ కృష్ణా కన్నీరు పెడుతూ.. సౌందర్య తో మాట్లాడతాడు.. నేను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను.. మీరు దీపని వేడికి తీసుకుని రండి.. నాకు కనీసం దాని ఆచూకీ చెప్పినా చాలు రెండు చెంపలు వాయించి తీసుకొస్తాను అంటుంది సౌందర్య.. మీకు కనిపించాలని కోరుకుంటున్నా అని అంటాడు మురళీ కృష్ణ.. నా కోడలి గురించే కాదు.. మీ భార్య గురించి కూడా పట్టించుకోండి అని చెబుతుంది సౌందర్య.

విన్నావమ్మా మీ అత్తగారు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా..? అని అంటాడు మురళీ కృష్ణ.. తెలుసు నేను సిఫార్స్ లతో కాపురం నిలబెట్టుకోవాలని లేదు.. నా భర్తలో మార్పు వచ్చి రమ్మనమని అడిగే వరకూ రాను అంటుంది.. అయితే అప్పటివరకూ నేను నీకు తోడుగా ఉంటాను కాదనకూడదు.. మీ పిన్నిని మధ్యమధ్యలో వెళ్లి చూసి వస్తాను.. నన్ను వెళ్ళిపోమంటే మాత్రం.. మీ అత్తగారికి ఫోన్ చేస్తా అంటూ.. బండి దగ్గరకు కస్టమర్స్ ను చూసుకోవడానికి వెళ్తాడు.. దీప గురించి భాగ్యం వక్తలా పుచ్చుకుని సౌందర్యంతో మాట్లాడుతుంది. దేని గురించి ఆలోచిస్తున్నారు.. అంటూ అడుగుతుంది భాగ్యం.. అది ఇక్కడ ఉంటె మాత్రం పరిష్కారం దొరుకుతుందా అని ప్రశ్నిస్తుంది.. నేను సవతి తల్లినైనా దీప మా ఇంటి పిల్లకదా వదినా దాని తరపున రెండు నిముషాలు మాట్లాడవచ్చా.. దీప పదేళ్లు ఉంది మారిందా..? లేదే దాని పరిస్థితి మారిందా..? లేదే అసలు ఎప్పటికీ మారాడని తెలిసి అదే మారింది.. ఊరుమారింది.. దాని మనసు మారింది.. మారని మనిషి కోసం ఎన్నేళ్లు ఎదురుచూస్తే మారతాడు.. అసలు ఎన్నేళ్లు గడిచినా దానిని నమ్ముతాడా.. లేదే..? అసలు దాని నెత్తిమీద ఏ నిందవేసి వదిలిపెట్టాడో అది నిందేనని నిజం కాదని స్వయంగా విహారి భార్య తులసి చెప్పినా విన్నాడా.. లేదే..? విహారీ కి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పినా నమ్మలేదు..

అది చేసింది తప్పేనంటారా..? లేదే..? దీప వెళ్లిపోవడం తప్పే అటు అత్తింటికి.. ఇటు కన్న తండ్రికి బాధే.. మరి అది చేసింది తప్పేనంటారా..? దాని కాపురం నిలబెట్టుకోవడానికి ఇంకేమైనా ఆధారాలున్నాయా ఏమైనా అవకాశాలున్నా ఉంటె ఎం ఒరిగేదో చెప్పింది వదినా..? దానికోసం మీరు పిల్లల కోసం మీ అబ్బాయి బాధపడుతున్నాడు ఉంటె చెప్పండి వదినా నేను వెళ్లి వెదికి తీసుకొస్తాను అంటుంది భాగ్యం..

దీప వెళ్ళిపోయాక అందరూ బాధపడుతున్నారు.. ఈ బాధ అంతా అది వెళ్ళిపోయాక పడితే ఎం లాభం అని ప్రశ్నిస్తుంది… పిల్లల కోసమైనా దాని కాపురాన్ని నిలబెట్టగలిగారా..? ఎంతో పెద్ద కంపెనీని నడుపుతున్న మీరే ఒక కొడుకు మనసు మార్చలేకపోయారు..? దాని కాపురాన్ని నిలబెట్టలేకపోయారు.. ఇక వంటలక్క మాత్రం ఎం చేస్తుంది వదినా..?

నేను సవతి తల్లిని కనుక దాని కాపురాన్ని నిలబెట్టలేక పోయాను.. దాని తండ్రి పేద తండ్రి కనుక మీ అబ్బాయి నోరు మూయించగలిగారు .. దానిని ఒంటరిదానిని చేశారు కదా వదినా.. అది ఇక్కడ ఉంటె ఏమిటి..? ఎక్కడ ఉంటె ఏమిటి అని ప్రశ్నిస్తుంది. నేను కన్న తండ్రి బాధ చూడలేక దీపని వెదకమన్నా..? అయినా దీప వస్తుందని ఆశలేదు.. అంతగా మనసు విరిగిపోయాక దీప తిరిగి వస్తుందని ఆశా లేదు.. మీ అబ్బాయి మాత్రం పెంచుకున్న కూతురు కనిపించడం లేదని నీ బిడ్డ ఎక్కడ ఉందొ చెప్పు అంటూ మా ఆయన మీద ఎగిరిపడడానికి వచ్చాడు వదినా..? . ఎవరో చెబితేనే కదా ఇక్కడ దాకా వచ్చింది..? ఎవరో చెబితేనే కదా దానిని అనుమానించాడు.. ఎవరో చెబితేనే కదా దానిని వదిలేసింది.. ఎవరో చెబుతుంటేనే కదా..? దానిని నమ్మనిది .. ఎవరో చెబుతుంటేనే కదా మీ నమ్మకాన్ని కొట్టిపడేసేది.. ఆ ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విన్నంత కాలం మీ అబ్బాయిని ఆ దేవుడు కూడా మార్చలేదు వదినా అంటుంది భాగ్యం.. నేను ఎక్కువ మాట్లాడితే క్షమించు వదినా అంటూ కన్నీరు పెడుతుంది భాగ్యం..

దీప ఇడ్లీ బండి దగ్గర తండ్రి కోసం వేడుకుంటుంది.. పప్పు రుబ్బుతున్న తండ్రిని చూస్తుంది..

Also Read:ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. కరోనా కట్టడికి కఠినమైన ఆంక్షలు

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందడి.. అభ్యర్థి ఎంపికపై ప్రధాన పార్టీల కసరత్తు.. ఒకటి, రెండురోజుల్లో ప్రకటించే ఛాన్స్!

విశాఖ రైల్వే జోన్‌ ప్రక్రియలో మరో ముందడుగు.. కీలక ప్రకటన
విశాఖ రైల్వే జోన్‌ ప్రక్రియలో మరో ముందడుగు.. కీలక ప్రకటన
సమ సప్తకంలో వక్ర గ్రహాలు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు
సమ సప్తకంలో వక్ర గ్రహాలు.. ఆ రాశుల వారికి శుభ యోగాలు
అల్లు అర్జున్, శ్రీలీల కిస్సిక్ సాంగ్.. ఏయే భాషలో ఎవరు పాడారంటే ?
అల్లు అర్జున్, శ్రీలీల కిస్సిక్ సాంగ్.. ఏయే భాషలో ఎవరు పాడారంటే ?
రాజ్ భవన్‌లో సొంత విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్..!
రాజ్ భవన్‌లో సొంత విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్..!
మ‌ద్యం కిక్కులో ట్రాఫిక్ పోలీసుల‌కు చుక్కలు చూపించిన మందుబాబు
మ‌ద్యం కిక్కులో ట్రాఫిక్ పోలీసుల‌కు చుక్కలు చూపించిన మందుబాబు
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. ఎవరి వ్యూహం వారిదే..
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. ఎవరి వ్యూహం వారిదే..
టాలీవుడ్ రేసులో భాగ్య శ్రీ బోర్సే దూకుడు.! ఎందుకు ఇంత క్రేజ్.?
టాలీవుడ్ రేసులో భాగ్య శ్రీ బోర్సే దూకుడు.! ఎందుకు ఇంత క్రేజ్.?
ఇంట్లో చెదలు శాశ్వతంగా పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఇంట్లో చెదలు శాశ్వతంగా పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మొన్న రూ. 8 కోట్లు.. కట్‌చేస్తే.. నేడు రూ. 23 కోట్లకు పైగానే
మొన్న రూ. 8 కోట్లు.. కట్‌చేస్తే.. నేడు రూ. 23 కోట్లకు పైగానే
అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆరోజు నుంచే స్ట్రీమింగ్
అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆరోజు నుంచే స్ట్రీమింగ్
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.