Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 : బిగ్‌బాస్‌-5 హోస్ట్‌గా మాస్ హీరో..? ఆ వెటరన్‌ హీరో తప్పుకున్నట్లేనా.. ప్రొడ్యూసర్స్ ఏం చెబుతున్నారు..

Bigg Boss 5 Host: 'బిగ్ బాస్' రియాలిటీ షో తమిళ వెర్షన్ ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటివరకు అన్ని సీజన్లలో

Bigg Boss 5 : బిగ్‌బాస్‌-5 హోస్ట్‌గా మాస్ హీరో..? ఆ వెటరన్‌ హీరో తప్పుకున్నట్లేనా.. ప్రొడ్యూసర్స్ ఏం చెబుతున్నారు..
Bigg Boss 5
Follow us
uppula Raju

|

Updated on: Mar 23, 2021 | 1:12 PM

Bigg Boss 5 : ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తమిళ వెర్షన్ ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటివరకు అన్ని సీజన్లలో కమల్ హాసన్ హోస్ట్‌గా చేసారు.. అంతేకాకుండా తన రాజకీయ ప్రేక్షకులను బాగా అలరించారు. అయితే ఐదో సీజన్‌కి కొత్త హోస్ట్‌ వస్తున్నారని తెలుస్తోంది. మొదటి మూడు సీజన్ల మాదిరిగానే ఈ సంవత్సరం జూన్ లేదా జూలైలో ప్రదర్శనను ప్రారంభించాలనే ప్రణాళికతో ‘బిగ్ బాస్ 5’ ప్రారంభ పనులు మొదలయ్యాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ‘బిగ్ బాస్ 4’ అక్టోబర్‌లో ఆలస్యంగా ప్రారంభమై జనవరిలో ముగిసిన సంగతి తెలిసిందే.

కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యుమ్ పార్టీ స్థాపించి తమిళనాడు ఎన్నికల్లో బిజీగా మారాడు. అంతేకాకుండా ఏప్రిల్ 6 న తమిళనాడు అసెంబ్లీకి జరిగే తన మొదటి ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బిగ్‌బాస్ 5కి హోస్ట్‌గా వ్యవహరించడం అనుమానమే. దీంతో తెరపైకి మరో యువ నటుడి పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ‘బిగ్ బాస్ 5’ నిర్మాతలు కమల్ స్థానంలో మాస్ హీరో శింబూతో చర్చలు ప్రారంభించారని, ఆయనకు కూడా చాలా ఆసక్తి ఉన్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది.

తమిళనాట హీరో శింబుకి మంచి ఫాలోయింగ్‌ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మాస్ హీరోగా మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు దర్శకత్వం ‘మనాడు’ చిత్రాల చిత్రీకరణలో ఉన్నాడు. కల్యాణి ప్రియదర్శన్, గౌతమ్ కార్తీక్, ప్రియ భవానీ శంకర్ నటించిన ‘పాతు థాల’ మూవీలో కూడా నటిస్తున్నాడు.

భార్య, కుమారుడి ప్రేమకు తల్లడిల్లిన ఉగ్రవాది.. కానీ లొంగిపోలేని పరిస్థితి.. కంటతడిపెట్టిస్తోన్న చిన్నారి మాటలు..

Kareena Kapoor: బిడ్డ పుట్టిన నెల రోజులకే షూటింగ్‌లో పాల్గొన్న బాలీవుడ్‌ నటీ కరీనా కపూర్‌

అసెంబ్లీ వేదికగా కేంద్రంపై కేటీఆర్ ఫైర్… స్పెషల్ ప్యాకేజీతో రాష్ట్రానికి ఒరిగిందేమీలేదన్న మంత్రి

ED Inspections In Kurnool District : కర్నూలు జిల్లాలో ఈడీ తనిఖీల కలకలం.. ఎన్నికల్లో డబ్బుల ట్రాన్సాక్షన్‌పై విచారణ