Irumudi Movie Controversy : మరో వివాదంలో ఇరుముడి సినిమా.. చైల్డ్ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ పై తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు..
ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఇరుముడి. మాస్ మాహరాజ రవితేజ , డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో వ్చిచన ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడం పై తెలంగాణ ప్రభుత్వం నిర్మాతలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

మాస్ మాహరాజా రవితేజ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ఇరుముడి. ఇందులో ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయి కుమార్ కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 21న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ అటు వసూళ్లపరంగానూ దుమ్మురేపింది. చాలా కాలం తర్వాత రవితేజ ఖాతాలో భారీ బ్లక్ బస్టర్ హిట్టు పడింది. అలాగే హీరోతోపాటు బేబీ నక్షత్ర అలాగే సినిమాలోని ప్రతి నటీనటులు తమ నటనకు ప్రశంసలు అందుకున్నారు. అటు ఈ మూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే థియేట్రికల్ రన్ పూర్తై అటు ఓటీటీలోనూ ఈ మూవీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అయితే సినిమా విడుదలైన రెండు నెలలకు ఈ మూవీ ఓ వివాదంలో చిక్కుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
ఇరుముడి చిత్రంలో మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంపై తెలంగాణ ప్రభుత్వం నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. బాలకార్మిక చట్టాలు, నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని కోరింది. అలాగే బాలికతో షూటింగ్ చేయడానికి ముందు జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా.. ? అలాగే బాలిక తల్లిదండ్రుల నుంచి అధికారిక సమ్మతి పత్రం పొందారా ? బాలిక పారితోషికంలో 20 శాతం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా ? అని చిత్రబృందాన్ని తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ప్రశ్నించారు. అలాగే బాలికకు సంబంధించిన కాల్ షీట్స్, అటెండెన్స్ రికార్డులు, షూటింగ్ లో పాల్గొన్న పని గంటల వివరాలు, బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, ఆమె భద్రత, సంక్షేమం కోసం సంరరక్షకుడిని నియమించారా ? వంటి అనేక వివరాలను స్పష్టం చేయాలని ఆదేశించింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
వీటితోపాటు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ వేడుకలో చిన్నారి పాల్గొనేలా చేయడంపై చిత్రయూనిట్ వివరణ ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని చిత్ర నిర్మాతలను కార్మిక శాఖ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. జైలోక్ సత్తా సోషల్ జస్టిస్ ఫోరం చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
