Kareena Kapoor: బిడ్డ పుట్టిన నెల రోజులకే షూటింగ్‌లో పాల్గొన్న బాలీవుడ్ నటీ కరీనా కపూర్
Kareena Kapoor: బాలీవుడ్ కరీనా కపూర్ ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే బిడ్డ పుట్టి నెల రోజుల తర్వాత కరీనా షూటింగ్‌లో పాల్గొంటోంది. ముం.
Kareena Kapoor: బాలీవుడ్ కరీనా కపూర్ ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే బిడ్డ పుట్టి నెల రోజుల తర్వాత కరీనా షూటింగ్‌లో పాల్గొంటోంది. ముంబైలోని బాంద్రాలో ఓ సినిమా షూటింగ్‌కు హాజరైంది. తన బృందంతో కలిసి షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన కరీనా, కారు దిగి వెళ్తున్న సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కరీనా మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్, లాల్‌సింగ్ చద్దాతో పాటు బహుబలి రచయిత విజేంద్రప్రసాద్ కథ అందిస్తున్న ‘సీత – ది ఇన్‌కర్నేషన్’లో ఫిమేల్ లీడ్‌గా కనిపించనుంది.
కాగా, ఫిబ్రవరి 21, 2021 న కరీనా ఒక పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. అయితే కరీనా కపూర్ షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా, అభిమానులకు, ప్రేక్షకులకు కరోనా గురించి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇవీ చదవండి: ఈసారి కూడా బ్లాక్ బస్టర్ హిట్టే.. అందుకే ‘బిచ్చగాడు 2’కి ఆయన డైరెక్టర్.. విజయ్ ఆంటోని
నయన్, విఘ్నేశ్ పెళ్ళికి బాజాలు మోగనున్నాయా.. ఎంగేజ్మెంట్ అయ్యిందంటూ చక్కర్లు కొడుతున్న వార్తలు..
View this post on Instagram