AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి కూడా బ్లాక్ బస్టర్ హిట్టే.. అందుకే ‘బిచ్చగాడు 2’కి ఆయన డైరెక్టర్.. విజయ్ ఆంటోని

Vijay Antony : నకిలి, డా.సలీమ్, బేతాళుడు వంటి విభిన్న సినిమాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విజయ్ ఆంటోని. 'బిచ్చగాడు' లాంటి సూపర్ హిట్ సినిమాతో విజయ్

ఈసారి కూడా బ్లాక్ బస్టర్ హిట్టే.. అందుకే 'బిచ్చగాడు 2'కి ఆయన డైరెక్టర్.. విజయ్ ఆంటోని
Vijay Antony
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2021 | 3:18 PM

Share

Vijay Antony : నకిలి, డా.సలీమ్, బేతాళుడు వంటి విభిన్న సినిమాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విజయ్ ఆంటోని. ‘బిచ్చగాడు’ లాంటి సూపర్ హిట్ సినిమాతో విజయ్ ఆంటోని క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయినా కానీ విజయ్ తన స్టోరీ ఎంపికలో మాత్రం తప్పటడగులు వేయకుండా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో.. మెట్రో వంటి డిఫరెంట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ రాఘవన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై టీడీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అంటూ చెప్పుకోచ్చారు హీరో విజయ్ ఆంటోని.

తెలుగు ప్రేక్షకులు కరోనా తర్వాత కూడా సినిమాలను ఆదరిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత విడుదలైన క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మా సినిమా విజయ్ రాఘవన్‏ను కూడా సూపర్ హిట్ చేస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు విజయ్. ద‌ర్శ‌కుడు ఆనంద కృష్ణ‌న్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. మద‌ర్ సెంటిమెంట్‌, ప్రేమ‌, రొమాన్స్‌, యాక్ష‌న్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ను ప‌క్కాగా మిక్స్ చేసి సినిమాను రూపొందించాడు. అందుకే నా తదపరి సినిమా ‘బిచ్చ‌గాడు 2’కి కూడా ఆయ‌న‌కే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాను. అలాగే నిర్మాత‌లు రాజాగారు, క‌మ‌ల్‌గారు, సంజ‌య్‌గారి స‌పోర్ట్‌తో సినిమాను ఈ ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వస్తున్నాం అంటూ చెప్పారు విజయ్. ఈ సినిమాలో ఆత్మిక హీరోయిన్‏గా నటిస్తుంది. ఇప్పటివరకు తెలుగు అనువాద కార్యక్రమాలు 60 శాతం పూర్తయ్యాయి. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ ‘సార్‌… మనం హిట్‌ కొడుతున్నాం’ అంటున్నారు. ఇదొక మాస్‌ ఎంటర్‌టైనర్‌’’ అని రైటర్‌ భాషాశ్రీ చెప్పారు.

Also Read:

సినీ ఇండస్ట్రీని వదలని కరోనా.. కోవిడ్ బారిన పడిన మాధవన్‎.. అమీర్ ఫోటోతో ఫన్నీగా ట్వీట్..

నయన్, విఘ్నేశ్ పెళ్ళికి బాజాలు మోగనున్నాయా.. ఎంగేజ్మెంట్ అయ్యిందంటూ చక్కర్లు కొడుతున్న వార్తలు..