AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ ఇండస్ట్రీని వదలని కరోనా.. కోవిడ్ బారిన పడిన మాధవన్‎.. అమీర్ ఫోటోతో ఫన్నీగా ట్వీట్..

R. Madhavan: దేశవ్యాప్తంగా కరోనా మహామ్మారి కోరలు చాస్తుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అటు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా కానీ.. ఫలితం

సినీ ఇండస్ట్రీని వదలని కరోనా.. కోవిడ్ బారిన పడిన మాధవన్‎.. అమీర్ ఫోటోతో ఫన్నీగా ట్వీట్..
R Madhavan
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2021 | 3:14 PM

Share

R. Madhavan: దేశవ్యాప్తంగా కరోనా మహామ్మారి కోరలు చాస్తుంది. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అటు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినా కానీ.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. మళ్లీ లాక్ డౌన్ అమలు చేసే దిశగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. దీంతో రాష్ట్రాలు కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడిప్పుడే ఊపందుకున్న సినీ పరిశ్రమకు కరోనా మళ్లీ అడ్డుకట్ట వేస్తుంది. వరుసగా నటీనటులు ఈ మహామ్మారి భారీన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‏ ఈ వైరస్ భారీన పడగా.. తాజాగా మరో హీరోకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

ప్రముఖ నటుడు మాధవన్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‏తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఫన్నీ కామెంట్ పెట్టాడు. వీరిద్దరు కలిసి హిందీలో త్రి ఇడియట్స్ సినిమాలో నటించారు. అందులోని వీరి పేర్లను అనుసరిస్తూ.. “రాంచో (3 ఇడియట్స్ సినిమాలో అమీర్ పేరు)ను ఫర్హాన్ (మాధవన్ పేరు)ఫాలో అవుతుంటే.. వైరస్ (సినిమాలో బోమన్ ఇరానీ) మా ఇద్దరి వెంట పడేవాడు.. అయితే ఈసారి అతడికి మేము చిక్కాము. అంటే అర్థం కరోనాకి చిక్కాము. ఆల్ ఈజ్ వెల్. తర్వలోనే ఈ మహామ్మారికి చెక్ పడుతుంది. ఇందులోకి మాతోపాటు రాజు రావోద్దని అనుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది” అంటూ రాసుకోచ్చారు మాధవన్. కాగా ఇప్పటికే అమిర్ ఖాన్ క్వారంటైన్‏లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూల్స్‏ను తిరిగి మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు మళ్లీ ఆన్‏లైన్‏లో క్లాసులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు మూసివేయడం లేదని.. కేవలం కరోనా నిబంధనలు జాగ్రత్తగా పాటించాలని తెలిపింది.

మాధవన్ ట్వీట్..

Also Read:

Sundeep Kishan’s Galli Rowdy : ‘రౌడీ బేబీ’ కాస్త ‘గల్లీ రౌడీ’గా మారిందిగా.. కొత్త టైటిల్ ను అనౌన్స్ చేసిన చిత్రయూనిట్..