AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangubai Kathiawadi defamation case: అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలాకు షాక్ ఇచ్చిన ముంబై కోర్టు

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పైన కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

Gangubai Kathiawadi defamation case: అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలాకు షాక్ ఇచ్చిన ముంబై కోర్టు
Gangubai Kathiawadi Defamat
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2021 | 2:34 PM

Share

Gangubai Kathiawadi: బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పైన కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పై ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. దాంతో ఈ ఇద్దరికీ కోర్టు షోకాజ్ నోటీసులు కూడా జరీ చేసింది. అసలు విషయం ఏంటంటే.. సంజయ్ లీలా బన్సాలీ ‘గంగూబాయ్ కతియావాడి’ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ ‘గంగూబాయి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమా పై గంగూబాయి కుమారుడు బాబూజీ రాజీ షా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కారు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ముంబై కోర్టు భన్సాలీ, అలియా మరియు ఇద్దరు రచయితలకు సమన్లు ​​జారీ చేసింది. ఈ చిత్ర బృందం తోపాటు అలాగే బాబూజీ రాజీ షా మే 21 న కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే ఈ చిత్రం మొదట గత ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది అయితే అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది. ఆతర్వాత కరోనా మహమ్మారి కారణంగా మరింత ఆలస్యం అయ్యింది. ఇక భన్సాలీ, జయంతిలాల్ గడా పెన్ ఇండియా లిమిటెడ్ కలిసి నిర్మిస్తున్న ‘గంగూబాయ్ కతియావాడి’ జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు వివాదం రేగడంతో సినిమా విడుదల పై ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ఎం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actor Virutchagakanth Babu: సినిమా పరిశ్రమలో విషాదం.. ఆటోలో నటుడి మృతదేహం.. అసలేమైంది..