Sundeep Kishan’s Galli Rowdy : ‘రౌడీ బేబీ’ కాస్త ‘గల్లీ రౌడీ’గా మారిందిగా.. కొత్త టైటిల్ ను అనౌన్స్ చేసిన చిత్రయూనిట్..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది.

Sundeep Kishan's Galli Rowdy : 'రౌడీ బేబీ' కాస్త 'గల్లీ రౌడీ'గా మారిందిగా.. కొత్త టైటిల్ ను అనౌన్స్ చేసిన చిత్రయూనిట్..
Galli Rowdy Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 25, 2021 | 2:54 PM

Galli Rowdy movie : టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ నికూడా చేసాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం.

ఇక ఈ సినిమా తర్వాత సందీప్ నటిస్తున్న సినిమా కు రౌడీ బేబీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. అయితే ఈ సినిమా టైటిల్ పైన రచ్చ జరిగింది. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ – ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి ఈ కామెడీ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అనుకోని సమస్యల కారణంగా ఈ సినిమా టైటిల్ ను మార్చారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గల్లీ రౌడీ గా మార్చారు చిత్రయూనిట్. దీనిని పూరీ జగన్నాథ్ – హరీష్ శంకర్ – గోపీచంద్ మలినేని – శివ నిర్వాణ – బాబీ లాంచ్ చేశారు. ఈ కొత్త టైటిల్ శివ నిర్వాణ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా విడుదల చేస్తూ… ‘పేరు మాత్రమే మారిందని, ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ అలానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా – నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చౌరస్తా రామ్ మిరియాల సంగీతం సమకూరుస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral: పిట్టగోడపై కాకి ‘క్యాట్ వాక్’.. అమ్మాయిలను మించి హోయలు ఒలకబోసింది.. మీరూ లుక్కేయండి.!

Gangubai Kathiawadi defamation case: అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలాకు షాక్ ఇచ్చిన ముంబై కోర్టు

అలనాటి లవర్ బాయ్ రీఎంట్రీ.. మళ్ళీ వెండి తెరపై అడుగు పెట్టడానికి సర్వం సిద్ధం.:Hero Tarun Reentry video