AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. కానీ అంతలోనే మార్చేసిందిగా.. వీడియో వైరల్..

‏Allu Arha: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహరెడిల కూతురు అల్లు అర్హ.. తన ముద్దు ముద్దు మాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

Allu Arjun: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. కానీ అంతలోనే మార్చేసిందిగా.. వీడియో వైరల్..
Allu Arha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 25, 2021 | 4:19 PM

‏Allu Arha: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహరెడిల కూతురు అల్లు అర్హ.. తన ముద్దు ముద్దు మాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటారు. తమ పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అల్లు అర్హ అల్లరి గురించి వీడిగా చెప్పాల్సిన పనేలేదు. గతంలో బెండకాయ్, దొండకాయ్ నువ్వు నా గుండె కాయ్ అంటూ తన తండ్రితో ఫన్నీగా మాట్లాడిన మాటలను అల్లు అర్జున్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ అల్లరి పిల్లకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తుంది. అందులో తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో క్యూట్ క్యూట్ ఎక్స్‏ప్రెషన్స్‏తో చెప్పేసింది. ఈ వీడియోను స్నేహ రెడ్డి తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేసింది.

ఇన్‏స్టా రీల్స్‏లో ఎక్కువగా ఫేమస్ అయిన డైలాగ్ అచ్చు.. తూమ్హరా ఫేవరేట్ హీరోయిన్ కౌ అని ఓ అబ్బాయి అడగ్గానే.. ఓ అమ్మాయి గొంతు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అంటుంది. వెంటనే స్పెల్లింగ్ చెప్పమని అడగ్గానే అలియా భట్ హై అంటూ వస్తుంది. ఈ డైలాగ్స్‏ను అల్లు అర్హ తన క్యూట్ క్యూట్ ఎక్స్‏ప్రెషన్స్‏తో డబ్ స్మాష్  చేసింది. ఈ వీడియోను అల్లు స్నేహ షేర్ చేసిన్న కోన్ని క్షణాల్లోనే పదమూడు వేల లైక్స్ వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇందులో అర్హ  వైట్ డ్రెస్‏లో చూడముచ్చటగా కనిపించింది. ఇటీవల అర్హ వైట్ డ్రెస్‏లో ఉన్న ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తోంది.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.

అల్లు అర్హ వీడియో..

Also Read:

ఈసారి కూడా బ్లాక్ బస్టర్ హిట్టే.. అందుకే ‘బిచ్చగాడు 2’కి ఆయన డైరెక్టర్.. విజయ్ ఆంటోని

సినీ ఇండస్ట్రీని వదలని కరోనా.. కోవిడ్ బారిన పడిన మాధవన్‎.. అమీర్ ఫోటోతో ఫన్నీగా ట్వీట్..