Upasana Konidela: త్రోబ్యాక్ పిక్చర్ షేర్ చేసిన రామ్ చరణ్ సతీమణి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

Ram Charan And Upasana Konidela: ఉపాసన కొణిదల.. కేవలం రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హాస్పిటల్స్ ఇంచార్జ్‏గా ప్రతి ఒక్కరికి పరిచయమే.

Upasana Konidela: త్రోబ్యాక్ పిక్చర్ షేర్ చేసిన రామ్ చరణ్ సతీమణి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..
Upasana Konidela
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 25, 2021 | 4:50 PM

Ram Charan And Upasana Konidela: ఉపాసన కొణిదల.. కేవలం రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హాస్పిటల్స్ ఇంచార్జ్‏గా ప్రతి ఒక్కరికి పరిచయమే. కేవలం అపోలో అధినేత మనవరాలిగా కాకుండా.. సాధారణ అమ్మాయిలాగా.. సామాజిక సేవల్లో పాల్గోంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. తన వ్యక్తిగత విషయాలతోపాటు.. రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాల గురించి కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇటీవలి కాలంలో అక్కినేని కోడలు సమంతతో కలిసి కొన్ని ఆరోగ్య సూత్రాలు.. ఫిట్‏నేస్ టిప్స్ చెప్పిన ఉపాసన..తాజాగా ఓ త్రోబ్యాక్ పిక్చర్‏ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఆ ఫోటోలో రామ్ చరణ్, ఉపాసన రాయల్ బైక్ దగ్గర నిల్చోని ఉన్నారు. దీనిని పోస్ట్ చేస్తూ.. “సంతోషంగా ఉన్నవారు తమ జీవితంలోకి మరింత ఆనందాన్ని ఆకర్షిస్తారు… నేను దీనిని నమ్ముతున్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే ఉపాసన మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ నటిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ లోకేషన్‏లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. పూజాహెగ్డే కీలక పాత్రలో నటింస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ  ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మెగా పవర్ స్టార్ రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 13న దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదే కాకుండా.. రామ్ చరణ్.. జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. వీరిద్ధరికి జోడీలుగా.. అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు జక్కన్న. ఈ సినిమాతో బాలీవుడ్ నటీనటులతోపాటు.. హాలీవుడ్ నటులను కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు దర్శకదీరుడు.

ఉపాసన కొణిదెల ట్వీట్..

Also Read:

Allu Arjun: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. కానీ అంతలోనే మార్చేసిందిగా.. వీడియో వైరల్..

ఈసారి కూడా బ్లాక్ బస్టర్ హిట్టే.. అందుకే ‘బిచ్చగాడు 2’కి ఆయన డైరెక్టర్.. విజయ్ ఆంటోని