AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినియోగదారులకు షాక్ ఇచ్చిన వోడాఫోన్ ఐడియా.. ఆ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన టెలీకాం సంస్థ..

Vodafone Idea: వోడాఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా తన రెండు ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరలను పెంచింది. ఇందులో రూ.598గా ఉన్న ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరను రూ.649కు పెంచగా.. రూ.749 ప్లాన్

వినియోగదారులకు షాక్ ఇచ్చిన వోడాఫోన్ ఐడియా.. ఆ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన టెలీకాం సంస్థ..
Vodafone Idea
Rajitha Chanti
|

Updated on: Mar 24, 2021 | 7:48 PM

Share

Vodafone Idea: వోడాఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా తన రెండు ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరలను పెంచింది. ఇందులో రూ.598గా ఉన్న ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరను రూ.649కు పెంచగా.. రూ.749 ప్లాన్ ఇప్పుడు రూ.799కు పెంచింది.

రూ .649, రూ .799 ప్లాన్‌లతో పాటు, టెలికాం టెక్ సంస్థల నివేదిక ప్రకారం వి ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను రూ.99, రూ.948, రూ.1,348 కూడా అందిస్తుంది. అన్ని Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు 200GB డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాన్ని అందించనున్నాయి. ఇక ఇందులో అమెజాన్ ప్రైమ్, జీ5, వి సినిమాలతోపాటు, టీవీ, మొబైల్ సెక్యూరిటీ భీమాకు సంవత్సర చందాతోపాటు, అన్ లిమిటెడ్ కాల్స్, నెలకు రూ.100 ఎస్ఎంఎస్ ఆఫర్లను అందిచనుంది.

Vi ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ రూ.649… ఆఫర్లు..

వీ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ నెలవారీ ప్లాన్ ప్రస్తుతం రూ.649 అని.. గతంలో దీని ధర రూ.598 అని టెలికాం టాక్ నివేదిక తెలిపింది. ఇది ఒక యాడ్-ఆన్ కనెక్షన్‌తో సహా రెండు కనెక్షన్‌లను అందిస్తుంది. ఇది మొత్తం 80GB డేటాను అందించనుంది. అలాగే 50GB ప్రైమరీ కనెక్షన్ కోసం, 30GB రెండవ కనెక్షన్ కోసం అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఫ్రీ ఎస్ఎంఎస్ అందించనుంది.

Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.799 ఆఫర్లు..

ముందుగా Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధర రూ.749 ఉండగా.. ఇప్పుడు దానిని రూ.799గా మార్చారు. కొత్తగా ఇది 3 కనెక్షన్లను అందించనుంది. ఇందులో ఒకటి ప్రైమరీ కనెక్షన్ కాగా.. మిగిలినవి యాడ్ ఆన్లు. దీని ద్వారా మొత్తం 120GB డేటాను పొందవచ్చు. ఇందులో 60GB ప్రైమరీ, 30GB సెకండరీ కనెక్షన్లు అందుబాటులో ఉంటాయి. 649 రూపాయల వై ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాదిరిగానే అన్ లిమిటెడ్ కాల్స్, నెలకు 100 ఎస్ఎంఎస్‏లను పొందవచ్చు.

Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ రూ.948, రూ.999, రూ.1,348 ప్రయోజనాలు…

— రూ.948 Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రెండు కనెక్షన్‌లను అందిస్తుంది. ఇందులో ఒకటి ప్రైమరీ కాగా.. మరోకటి యాడ్ ఆన్. ప్రైమరీ కనెక్షన్ ద్వారా వినియోగదారులకు నెలకు 150GB డేటాను పొందవచ్చు. అలాగే యాడ్ ఆన్ కనెక్షన్ ద్వారా వినియోగదారులు 30GB నెలవారీ డేటాను పొందుతారు. నెలకు రూ .249 చొప్పున మొత్తం ఐదు కనెక్షన్లను అందించనుంది.

–రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో ప్రైమరీ కనెక్షన్, నాలుగు యాడ్ ఆన్ కనెక్షన్స్‏తో సహా.. ఐదు కనెక్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో వినియోగదారులు మొత్తం 200GB డేటాను పొందవచ్చు. ప్రైమరీ కనెక్షన్ ద్వారా 80GB డేటా, అలాగే సెకండరీ వినియోగదారులకు 30GB డేటా అందించనుంది.

— ఇక చివరిది రూ.1,348 Vi ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రైమరీ కనెక్షన్ వినియోగదారులకు అన్ లిమిటెడ్ డేటా అందించనుంది. అలాగే సెకండరీ కనెక్షన్ ద్వారా 30 GB డేటా అందించనుంది.

Also Read:

Postal Life Insurance : పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ.. అదిరిపోయే బెనిఫిట్స్ .. రూ.1045తో ఎన్ని లక్షలు పొందవచ్చో తెలుసా..!