Dhanurasana Benefits : పొడవు కావాలనుకుంటున్నారా..? ఈ ఆసనాన్ని ట్రై చేస్తే సరి..?
శరీరాన్ని యోగా ఫిట్నెస్ గా ఉంచితే.. మనసుని ధ్యానం ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రస్తుత కాలంలో మనిషి జీవనం ఉరుకులు పరుగులుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు...
Dhanurasana Benefits: శరీరాన్ని యోగా ఫిట్నెస్ గా ఉంచితే.. మనసుని ధ్యానం ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రస్తుత కాలంలో మనిషి జీవనం ఉరుకులు పరుగులుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు ఉదయమే యోగాసనాలు చేస్తే.. శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. పని చేయడానికి ఆసక్తిని కలిగిస్తాయి. ఈరోజు యోగాసనాల్లో ఒకటి ధనురాసనం గురించి తెలుసుకుందాం.. ఈ ఆసనం ఎలా వేయాలి.. ఉపయోగాలు ఏమిటి చూద్దాం..?
ధనురాసనం .. ధనుస్సు లేదా విల్లును పోలి ఉంటుంది, అందుకనే ఈ ఆసనానికి ధనురాసనమని పేరువచ్చింది. ఇది భుజంగాసనం, శలభాసనం అను రెండాసనాల సమన్వయం.
ఆసనం వేయు పద్దతి:
ధనుస్ అంటే సంస్కృతంలో విల్లు. శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం. ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని వెనుక్కి వంచి పాదాలను చేతుల్తో పట్టుకుని ఈ ఆసనాన్ని చేయాలి. ఇది చేయాలంటే ముందుగా చదునైన ప్రదేశంలో చాప కాని దర్భాసనం వేరేదైనా కానీ నేలపై పరచి దానిపై మెత్తటి దుప్పటి లాంటిది వేసి ఆసనాన్ని చేయాలి.
నేల మీద బోర్లా పడుకుని చేతులని ఆనించండి. గడ్డం నేలపై ఆనించి భుజాలను ఆనుకుని ఉండేలా చూసి పాదాలను కొంచం ఎడంగా ఉంచాలి. కండరాలను వదులుగా ఉండేలా చూసుకోవాలి. గాలి సాధారణంగా పీల్చుకోవాలి . కాళ్ళను మెల్లిగా వెనుకకు వంచాలి. చేతులతో చీలమండలాలను గట్టిగా పట్టుకోవాలి. తల, మెడను మెల్లగా వెనుకకు వంచాలి. దీర్ఘంగా గాలి పీల్చుకోవాలి.పది సెకనులు పీల్చుకోవాలి. కనీసం 3 సెకనులు తరువాత గాలి మెల్లగా వదలాలి. 15 సెకనులు పూర్తిగా గాలి వదలాలి. కాళ్ళు మెల్లగా వెనుకకు వదలాలి. క్రమంమంగా మోకాళ్ళు, బొటన వ్రేళ్ళు దగ్గరకు చేర్చాలి.
బోర్లా పడుకొని రెండు కాళ్ళను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి. కొద్దిగా శ్వాస పీల్చి తలను, కాళ్ళను పైకి ఎత్తాలి. పొట్ట మాత్రం నేలమీద ఉంటుంది. తరువాత కొద్ది సేపు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
ఈ ఆసనంవల్ల ఉపయోగాలు :
శరీరంలోని అన్ని రకాల కీళ్ళ జాయింట్లు బలోపేతమవుతాయి . పొట్ట, నడుము భాగంలోని కొవ్వుని కరిగిస్తుంది . జీర్ణ శక్తిని పెంచుతుంది . వెన్నెముకకు సాగే గుణాన్ని ఇస్తుంది. దీని వలన పొడుగు పెరిగే అవకాశముంది. ఆసనం వల్ల దీర్ఘకాలపు జీర్ణకోశవ్యాధులు, ప్రేగుల నొప్పులు తగ్గుతాయి. అస్తమా , మధుమేహం, మలబద్ధకం , నాడీబలహీనత సమస్యలను తగ్గిస్తుంది. స్త్రీలలో రుతుక్రమం సమస్యలకు చెక్ పెడుతుంది.
గమనిక : ఆ ధనురాసనం గుండె జబ్బులు, కడుపులో కురుపు, వరిబీజం , వెన్నుపూసల నొప్పి వంటివి గలవారు వేయకూడదు.
Also Read: కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో మళ్లీ మూతపడనున్న థియేటర్లు.? ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం.!