Telangana Corona Effect: తెలంగాణలో మళ్లీ మూతపడనున్న థియేటర్లు.? క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..

Corona Effect Telangana: తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో థియేటర్లు మరోసారి మూతపడతాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Telangana Corona Effect: తెలంగాణలో మళ్లీ మూతపడనున్న థియేటర్లు.? క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 24, 2021 | 1:12 PM

Corona Effect Telangana: తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో థియేటర్లు మరోసారి మూతపడతాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా ధియేటర్లను మూసి వేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఖండించారు. సినిమా థియేటర్లు మూసివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఇప్పుడున్న కోవిడ్ నిబంధనల ప్రకారమే సినిమా థియేటర్‌లు యధావిధిగా నడుస్తాయని.. సీట్ల కుదింపుపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. మళ్లీ థియేటర్లు మూసివేత దిశగా వెళ్తే సినీ పరిశ్రమ భారీ నష్టాలు చవి చూస్తుందని.. వేలాది మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.

తెలంగాణలో కొత్తగా 431 పాజిటివ్ కేసులు, రెండు మరణాలు…

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 421 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. కాగా మంగళవారం కరోనాతో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో విడత విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా క్రమంగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగంతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 431 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3,04,298కు చేరింది. మంగళవారం 228 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. ఇద్దరు మరణించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి 2,99,270 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మృతుల సంఖ్య 1,676కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,352 యాక్టివ్‌ కేసులుండగా.. 1,359 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.55శాతం ఉండగా, రికవరీ రేటు 98.34శాతంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

జనసైనికుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాపాకకు నో ఎంట్రీ బోర్డు.. వైరల్ అవుతున్న పిక్.!

బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే.. ఇవాళ ఏకంగా…