Bank Holidays in April 2021 : బ్యాంక్ వినియోగదారులు బీ అలర్ట్.. ఏప్రిల్ లో ఎన్నో రోజులు బ్యాంకులకు సెలవులో తెలుసా..?

ఏప్రిల్ నెలలో కూడా పండుగలున్నాయి. ఇక వారానికి నాలుగు రోజులు సెలవులు ఉండనే ఉంటాయి. దీంతో ఏప్రిల్ లో ఎవరికైనా ముఖ్యమైన బ్యాంక్ లావాదేవీలుంటే బీ అలెర్ట్..

Bank Holidays in April 2021 : బ్యాంక్ వినియోగదారులు బీ అలర్ట్.. ఏప్రిల్ లో ఎన్నో రోజులు బ్యాంకులకు సెలవులో తెలుసా..?
April Bank Holidays 2021
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2021 | 11:40 AM

Bank Holidays in April 2021 : ఏప్రిల్ నెలలో కూడా పండుగలున్నాయి. ఇక వారానికి నాలుగు రోజులు సెలవులు ఉండనే ఉంటాయి. దీంతో ఏప్రిల్ లో ఎవరికైనా ముఖ్యమైన బ్యాంక్ లావాదేవీలుంటే బీ అలెర్ట్.. ఎందుకంటే ఏప్రిల్ లో దాదాపు 12 రోజులు హాలీడేస్ రానున్నాయి. ఏప్రిల్ లో గుడ్ ఫ్రైడే, ఉగాది,ఎం శ్రీరామ నవమి పండుగలతో పాటు.. నేషనల్ హాలీడేస్ అయిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతిలు కూడా ఉన్నాయి. ఇక వీటితో పాటు ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలు సెలవులు.. దీంతో ఇవన్నీ కలిసి ఏప్రిల్ లో మొత్తం 12 రోజులు బ్యాంక్ లు మూసివేసి ఉంటాయి. అయితే ఈ బ్యాంక్ పనిదినాలు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సంబంధించినవి.. ఎందుకంటే బ్యాంక్ హాలిడేస్ రాష్ట్రానికి అనుగుణంగా మారతాయి.

ఏప్రిల్ లో నెలలో మొత్తం 30 రోజుల్లో 12 రోజులు బ్యాంక్ హాలీడేస్.. దీంతో ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 18 రోజులే. కనుక ఎవరికైనా బ్యాంక్ లావాదేవీలు ఉంటె ఆ సెలవులకు అనుగుణంగా ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

ఏప్రిల్ 1- బ్యాంకుల అకౌంటింగ్ .. ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే… ఏప్రిల్ 4- ఆదివారం… ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి… ఏప్రిల్ 10- రెండో శనివారం… ఏప్రిల్ 11- ఆదివారం… ఏప్రిల్ 13- ఉగాది… ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి … ఏప్రిల్ 18- ఆదివారం… ఏప్రిల్ 21- శ్రీరామనవమి… ఏప్రిల్ 24- నాలుగో శనివారం… ఏప్రిల్ 25- ఆదివారం..

వినియోగదారులు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని ముందుగా తమ బ్యాంక్ లావాదేవీలను ప్లాన్ చేస్తుకోవాల్సి ఉంటుంది.

Also Read: వారణాసి నుంచి అయోధ్య వరకూ ఒకేసారి సందర్శించాలనుకుంటున్నారా..? ఈ స్పెషల్ ప్యాకేజీ మీకోసమే

సివిల్స్‌లో సత్తా చాటిన జామియా మిలియా ఇస్లామియా.. ఇంటర్వూకి ఎంపికైన 34 మంది విద్యార్థులు..