వారణాసి నుంచి అయోధ్య వరకూ ఒకేసారి సందర్శించాలనుకుంటున్నారా..? ఈ స్పెషల్ ప్యాకేజీ మీకోసమే

భారత రైల్వే శాఖ దేశంలోని ప్రముఖ ప్రాంతాలను.. దర్శనీయ క్షేత్రాలను కలుపుతూ.. ప్రయాణీకులు దర్శించుకునే వీలుగా ఒక టూర్ ప్యాకేజీని అందిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా గంగా రామాయణ్...

వారణాసి నుంచి అయోధ్య వరకూ ఒకేసారి సందర్శించాలనుకుంటున్నారా..? ఈ స్పెషల్ ప్యాకేజీ మీకోసమే
Ganga Ramayan Yatra
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2021 | 11:07 AM

Ganga Ramayan Yatra :  భారత రైల్వే శాఖ దేశంలోని ప్రముఖ ప్రాంతాలను.. దర్శనీయ క్షేత్రాలను కలుపుతూ.. ప్రయాణీకులు దర్శించుకునే వీలుగా ఒక టూర్ ప్యాకేజీని అందిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా గంగా రామాయణ్‌ యాత్ర షెడ్యూల్ ను ప్రకటించింది. ఇది ఐఆర్‌సీటీసీ భారత్‌ దర్శన్‌లో భాగంగా ఏప్రిల్‌లో నిర్వహిస్తున్న టూర్‌ ప్యాకేజ్‌. ఈ పర్యటన ఐదు రోజుల పాటు సాగనుంది. అంటే నాలుగు రాత్రులు ఉంటుంది. ఇక ఈ టూర్ ఏప్రిల్‌ 7వ తేదీన మొదలై 11వ తేదీతో పూర్తవుతుంది. ఇందులో అయోధ్య, లక్నో, నైమిశారణ్యం, ప్రయాగరాజ్‌(అలహాబాద్‌), వారణాసిలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శించవచ్చు.

ఈ టూర్ ఏప్రిల్‌ 7 ఉదయం గం. 8.50 ని. హైదరాబాద్‌లో ఇండిగో విమానం స్టార్ట్ అవుతుంది. సరిగ్గా 10. 50 నిమిషాలకు వారణాసికి చేరుకుంటుంది. అక్కడ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణీకులను రైల్వే టూర్‌ సిబ్బంది పికప్‌ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. అనంతరం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, గంగాతీరం సందర్శనం ఉంటాయి.

ఇక 8వతేదీ తెల్లవారు జామున విశ్వనాథుని దర్శనం అనంతరం బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత ప్రయాణీకులు ప్రయాణం ప్రయాగరాజ్‌ వైపు సాగుతుంది. త్రివేణి సంగమం, అలోపీ దేవి దర్శనం అనంతరం హోటల్ లో బస చేయడానికి ఏర్పాట్లు చేశారు.. ఇక ఆరోజు రాత్రి ప్రయాగ్‌రాజ్‌లోనే ఉండనున్నారు.

ఏప్రిల్ 9 తేదీ ఉదయం ప్రయాగ్ రాజ్ లో బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత శృంగవర్‌పూర్‌ను చూసుకుంటూ ప్రయాణం అయోధ్య వైపు సాగుతుంది. ఆ రోజు అయోధ్యలోని పర్యాటక ప్రదేశాలను చూసిన అనంతరం ఆ రోజు రాత్రి అయోధ్యలోని బసచేయడానికి ఏర్పాట్లు చేశారు రైల్వే శాఖ.

ఇక 10 తేదీ ఉదయం అయోధ్య లో బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత నైమిశారణ్యంను సందర్శించి స్థానిక ఆలయాలను చూసుకుంటూ సాయంత్రానికి లక్నోకి చేరుకునే విధంగా రైల్వే శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇక ఆచివరి రోజు 11వ తేదీ బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత గది చెక్‌ అవుట్‌ చేసి బారా ఇమాంబారా సందర్శనం తర్వాత అంబేద్కర్‌ మెమోరియల్‌ పార్క్‌ చూపించి ఏడు గంటలకు ఎయిర్‌పోర్టులో దించుతారు. ఏడు గంటల పది నిమిషాలకు లక్నోలో బయలుదేరిన ఇండిగో విమానం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్‌ చేరడంతో గంగా రామాయణ యాత్ర పూర్తవుతుంది.

అయితే ఈ యాత్రకు టికెట్ ధరలను కూడా ప్రకటించారు. ఒక్కరే ఈ యాత్రను చేయాలను కుంటే రూ. 32,200 .. అదే ఇద్దరు కలిసి ఈ టూర్ కి వెళ్లాలను కుంటే ఒకొక్కరి రూ.24,700 .. ఇక ట్రిపుల్ ఆక్యుపెన్సీలో అయితే ఒక్కొక్కరికి రూ. 23, 550 ఛార్జీలుగా నిర్ణయించారు.

Also Read: దీప తరపున మాట్లాడిన భాగ్యం.. మీ అబ్బాయి చెప్పుడు మాటలు విన్నంత కాలం.. ఆ దేవుడు కూడా మార్చలేడు..

దేశంలో కొనసాగుతోన్న కరోనా తీవ్రత.. కొత్తగా 47,262 పాజిటివ్ కేసులు, 275 మరణాలు..