గుజరాత్ లో రంగుల పండుగ హోలీని శోభాయమానంగా జరుపుకుంటారు. ఫాల్గుణ నెలలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ ముఖ్యముగా హిందువుల పండుగ, వ్యవసాయములో రబీ పంటలకు ఇది ఒక సూచనా ప్రాయముగా ఉంటుంది. పల్లెల యొక్క కూడళ్ళలో, కాలనీలలో, వీధులలో భోగీ మంటలను వేస్తారు. ప్రజలు భోగీ మంటల ముందు ప్రార్థనలు చేస్తారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్కసామానులన్నీ తీసుకొచ్చి వేస్తారు.