Walking: చలికాలం ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
సాధారణంగా వాకింగ్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నడక రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదనంగా, మార్నింగ్ వాక్ మంచి సూర్యరశ్మిని అందిస్తుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అయితే, శీతాకాలంలో మార్నింగ్ తప్పనిసరిగా ప్రయోజనకరంగా ఉండదు. ఎందుకంటే..

చలి తీవ్రత ఎక్కువైంది. వాతావరణానికి అనుగుణంగా మనం వెచ్చని బట్టలు, వేడి ఆహారం, అనేక ఇతర వస్తువులను సర్దుబాటు చేసుకుంటాము. వీటన్నిటితో పాటు మార్నింగ్ వాకింగ్‌కు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. శీతాకాలంలో మార్నింగ్ వాక్ వేసవిలో ఉన్నంత ప్రయోజనకరంగా ఉంటుందా…? అంటే కాదనే సమాధానం వస్తుంది. చలికాలంలో ఉదయం వాకింగ్ చేస్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రయోజనాలకంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం…
సాధారణంగా వాకింగ్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నడక రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదనంగా, మార్నింగ్ వాక్ మంచి సూర్యరశ్మిని అందిస్తుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అయితే, శీతాకాలంలో మార్నింగ్ తప్పనిసరిగా ప్రయోజనకరంగా ఉండదు. ఎందుకంటే ఉదయం, సాయంత్రం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. ఈ సమయాల్లో బయట నడవడం హానికరం.
చలికాలం ఉదయాన్నే వాకింగ్ చేస్తే మంచిది కాదు. దీనివల్ల చల్లటి గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఇది బీపీ పెరగడానికి కారణమవుతుంది. గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాదు చలి గాలి వల్ల ఇమ్యూనిటీ కూడా వీక్ అవుతుంది. తరచూ జలుబు వచ్చే వారికి మరింత ప్రమాదం. రొంప సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంది.
శీతాకాలంలో వాయు కాలుష్య స్థాయిలు పెరుగుతాయి. మీరు ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతుంటే, ఉదయం నడక హానికరం కావచ్చు. చలికాలంలో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. నడవడం వల్ల అది మరింత తీవ్రమవుతుంది. అంతేకాదు.. గుండె ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. మీరు గుండె జబ్బులతో బాధపడుతున్నట్టయితే మార్నింగ్ వాక్ మరింత ప్రమాదకరం.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అయితే, మార్నింగ్ వాక్ చేయాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. స్వెటర్లు, జాకెట్లు, చేతి తొడుగులు, టోపీలు వంటి వెచ్చని దుస్తులు ధరించండి. ఉదయం 7-8 గంటల తర్వాత సూర్యుడు ఉదయించిన తరువాత మాత్రమే వాకింగ్ కోసం వెళ్లండి. బయట కాలుష్యం ఎక్కువగా ఉంటే, వాకింగ్ కోసం వెళ్లకపోవడమే మంచిది. అలాగే, నడక ప్రారంభించే ముందు కొద్దిగా వార్మ్ అప్ చేయండి. ఆ తరువాత నెమ్మదిగా నడవండి. ఎక్కువసేపు నడవకండి. మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








