గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, ముఖ్యంగా పండ్లు చాలా కీలకం. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాషన్ ఫ్రూట్ ప్రోటీన్‌కు, పనస పండు పొటాషియానికి, బేరి పండు కాల్షియానికి, చెర్రీస్ యాంటీఆక్సిడెంట్లకు ప్రసిద్ధి. అరటిపండులో అనేక ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఈ పోషక పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రకృతి ప్రసాదించిన పండ్లలో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఏ పండు తింటే ఏ రకమైన పోషకం అందుతుందో చాలామందికి తెలియదు. అందుకే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషక పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పాషన్ ఫ్రూట్ (కృష్ణ ఫలం)
సాధారణంగా ప్రోటీన్ అనగానే మనకు మాంసం లేదా పప్పులు గుర్తుకొస్తాయి. కానీ ప్యాషన్ ఫ్రూట్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర కణాల మరమ్మత్తుకు, కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మెగ్నీషియం ఎముకల బలానికి, మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుంది.
పనస పండు
పనస పండులో పొటాషియం నిల్వలు అధికం. ఇది రక్తపోటును నియంత్రించడమే కాకుండా కండరాల కదలికలను మెరుగుపరుస్తూ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బేరి పండు
ఎముకలు, దంతాలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం. బేరి పండ్లలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు.
చెర్రీస్
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆక్సీకరణ ఒత్తిడి సర్వసాధారణం. చెర్రీస్‌లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషతుల్యాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అరటిపండు
అరటిపండును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించవచ్చు. ఇందులో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం ఉత్తమం.
మందులు మింగడం కంటే ఇలాంటి పోషకాలు నిండిన పండ్లను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మీ అవసరానికి తగ్గట్టుగా సరైన పండును ఎంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




