Majestic Tulip Garden: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ వనం ప్రారంభం.. స్వాగతం పలుకుతున్న 15లక్షల మొక్కలు
భారతదేశం భూతాల స్వర్గం అందాల సుందర లోయ కాశ్మీర్ లో తులిప్ పువ్వులు విరబూశాయి. అక్కడ అందాలను చూడడానికి రమ్మనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
Majestic Tulip Garden: భారతదేశం భూతాల స్వర్గం అందాల సుందర లోయ కాశ్మీర్ లో తులిప్ పువ్వులు విరబూశాయి. అక్కడ అందాలను చూడడానికి రమ్మనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ఆహ్వానం పలికారు. జబర్వాన్ కొండల్లోని తులిప్ పూల వనం వీక్షకుల కోసం ఈరోజు ప్రారంభం కానుంది.
తులిప్ గార్డెన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మోడీ షేర్ చేశారు. గార్డెన్‌కు సంబంధించిన విశేషాలను వివరిస్తూనే పర్యాటకులను ”కశ్మీర్ చూదము రండి” అంటూ ఆహ్వానం పలికారు.
మార్చి 25 జమ్మూ కశ్మీర్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు అంటూ.. శ్రీనగర్ లోని జబర్వాన్ పర్వతప్రాంతంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన ప్రసిద్ద “ఇందిరాగాంధీ మొమోరియల్ తులిప్ గార్డెన్” ను సందర్శించమని కోరారు. ఈ గార్డెన్‌లో 64 రకాల్లో మొత్తం 15 లక్షల తులిప్ మొక్కలు ఉన్నాయి” అని ట్వీట్ చేశారు. దీనికి అనుగుణంగా ”మీకు ఎప్పుడు అవకాశం దొరికినా జమ్మూ కశ్మీర్‌కు వచ్చి సుందరమైన తులిప్ పండుగను ఆస్వాదించండి. తులిప్ అందాలతో పాటు జమ్మూ కశ్మీర్ ప్రజల కమ్మని ఆతిధ్యాన్ని కూడా మీరు స్వీకరిస్తారు” అంటూ మరో ట్వీట్ చేశారు. గార్డెన్‌కు సంబంధించిన ఫొటోలను కూడా మోడీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
కాగా, అధికారికంగా సిరాజ్ బాగ్ గా పిలువబడే ఇందిరాగాంధీ మొమోరియల్ తులిప్ గార్డెన్ ను 2008లో అప్పటి జమ్మూకశ్మీర్ సీఎం గులాంనబీ ఆజాద్ పర్యాటకుల సందర్శనార్థం ప్రారంభించారు. తులిప్ గార్డెన్.. నాలుగు దిక్కులా ఎటు చూసినా తులిప్ పువ్వులే మనకు దర్శనమిస్తాయి. తెలుపు, పసుపు, పింక్.. ఇలా రక రకాల రంగుల్లో.. ఆకాశం నుంచి చూస్తే.. ఇంద్ర ధనుస్సు నేల మీద విరిసిందా.. అన్నట్లుగా ఆ తులిప్స్ తమ అందాలతో మనకు కనువిందు చేస్తాయి. సృష్టిలోని అందమంతా తమలోనే దాగుందన్నట్లు.. పర్యాటకుల చూపును తమవైపు తిప్పుకుంటాయి. వాటిని చూసేందుకు నిజంగా మన రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. శ్రీనగర్ లోని దాల్ లేక్ సమీపంలో జబర్వాన్ రేంజ్‌లోని పర్వతసానువుల్లో ఈ గార్డెన్ ఉంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్‌లలో ఒకటి కావడం విశేషం.
ఇక కరోనా వైరస్ ప్రభావం జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్రంగా చూపించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం మళ్ళీ కాశ్మీర్ పర్యాటక రంగానికి ఊపు తెచ్చేవిధంగా ప్రచార కార్యక్రమం చేపట్టడానికి రెడీ అయ్యింది. ఈ తరుణంలో తులిప్ గార్డెన్ ను చూడడానికి రమ్మనమని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునివ్వడం కొత్త ఊపునిచ్చినట్లైంది.
Whenever you get the opportunity, do visit Jammu and Kashmir and witness the scenic Tulip festival. In addition to the tulips, you will experience the warm hospitality of the people of Jammu and Kashmir. pic.twitter.com/RuZorHWBrO
— Narendra Modi (@narendramodi) March 24, 2021
Also Read: తమిళనాట ఎన్నికల వేళ కమల్ హాసన్‌కు విచిత్ర అనుభవం.. ఆయన వీడియోతో ఆయనకే ఝలక్ ఇచ్చారు..