UPSC Main Result 2020 : సివిల్స్‌లో సత్తా చాటిన జామియా మిలియా ఇస్లామియా.. ఇంటర్వూకి ఎంపికైన 34 మంది విద్యార్థులు..
UPSC Main Result 2020 : ఢిల్లీకి చెందిన జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీకి చెందిన 34 మంది విద్యార్థులు సివిల్
UPSC Main Result 2020 : ఢిల్లీకి చెందిన జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీకి చెందిన 34 మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్ (మెయిన్): 2020 పరీక్షను క్లియర్ చేసి ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. మంగళవారం సివిల్ సర్వీసెస్ (మెయిన్) 2020 ఫలితాలను యూపీఎస్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇతర సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్ ‘ఎ’ మరియు గ్రూప్ ‘బి’) లకు ఎంపిక చేసేందుకు త్వరలోనే ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
జామియా మిలియా ఇస్లామియా కోచింగ్ సెంటర్.. అర్హతగల విద్యార్థుల కోసం వరుస మాక్ ఇంటర్వ్యూలు, ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులు ఆర్‌సిఎ, జెఎంఐలో ఉంటారు.. అక్కడ వారికి తరగతులు, టెస్ట్ సిరీస్, లైబ్రరీలు, ప్రత్యేక ఉపన్యాసాలు, మాక్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. గత ఏడాది సివిల్ సర్వీసుల్లో ఆర్‌సిఎ, జెఎంఐ నుంచి 30 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారందరు జార్ఖాండ్, బీహార్, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రజా సేవ చేస్తున్నారు. అలాగే ఐబి, సిఎపిఎఫ్, ఆర్‌బిఐ ఇతర కేంద్ర, రాష్ట్ర సేవలకు ఆర్‌సిఎకు చెందిన మరో 35 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు.
ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వూ (వ్యక్తిత్వ పరీక్ష)కు హాజరుకావలసి ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు లేకుండా 275 మార్కులు ఉంటాయి. అభ్యర్థులు వయస్సు, విద్యా అర్హతలు, సంఘం, ఆర్థికంగా బలహీనమైన విభాగం, పర్సన్ విత్ బెంచ్మార్క్ డిసేబిలిటీ ( PWBD) టిఎ ఫారం వంటి ఇతర పత్రాలకు సంబంధించిన వారి వాదనలకు మద్దతుగా వారి అసలు ధృవీకరణ పత్రాలను ఇంటర్వూకు తీసుకురావాలి.