Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్ బారినపడుతున్న స్త్రీలు .. ప్రాధమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యం.. లక్షణాలు ఇవే..!

క్యాన్సర్ లో అనేక రకాలు.. అయితే మహిళల్లో మాత్రమే కనిపించేది గర్భాశయ క్యాన్సర్. దీని బారిన ఎక్కువగా 15 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు...

Cervical Cancer:  గర్భాశయ క్యాన్సర్ బారినపడుతున్న స్త్రీలు ..  ప్రాధమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యం.. లక్షణాలు ఇవే..!
Cervical Cancer
Follow us
Surya Kala

|

Updated on: Mar 26, 2021 | 1:55 PM

Cervical Cancer: క్యాన్సర్ లో అనేక రకాలు.. అయితే మహిళల్లో మాత్రమే కనిపించేది గర్భాశయ క్యాన్సర్. ఎక్కువగా 15 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా భారత దేశంలో క్యాన్సర్​ బారిన పడే మహిళల్లో 6 నుంచి 29 శాతం మంది గర్భాశయ క్యాన్సర్​తోనే బాధపడుతున్నారని​ ఓ నివేదికలో తేలింది. ఈ క్యాన్సర్ బారిన పడి 2019లో ముఖ్యం గా 35 నుండి 39 సంవత్సరాల మధ్య ఉన్న 60,000 మంది మరణించారు. అందుకనే ఈ క్యాన్సర్ పట్ల ప్రతి స్త్రీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. ఈ నేపథ్యంలో గర్భాశయ క్యాన్సర్​ లక్షణాలు, దాన్ని ముందుగానే ఎలా గుర్తించాలో తెలుసుకోవాలీ.. ఎందుకంటే ప్రాధమిక దశలో గుర్తిస్తే ఈ క్యాన్సర్ నుంచి సులభంగా బయటపడ వచ్చు..

గర్భాశయ క్యాన్సర్ లో సాధారణం గా కనిపించే లక్షణాలు:

అసాధారణ యోని రక్తస్రావం గర్భాశయ క్యాన్సర్​కు హెచ్చరిక సంకేతం.. యోని నుండి నీరు మరియు చెడువాసనతో కూడిన రక్తస్రావం జరగడం శృంగారం చేసిన తర్వాత యోనిలో రక్తస్రావం నెలసరి మధ్య, మధ్య లో కూడా రక్తస్రావం యోనిలో మంట లేదా దురదకడుపు నొప్పి లేదా వెన్ను కింద నొప్పి విపరీతమైన అలసట మూత్రం ఆపుకోలేకపోవడం పొట్ట ఉబ్బరం అయితే చాలా మందిలో ఈ లక్షణాలు కనిపించినా తెలికగా తీసుకుంటున్నారు.. ఇవన్నీ వయసుతో పాటు సర్వసాధారణం అని భావిస్తారు.. అయితే గర్భాశయ క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత ముందుగా భయ పడవద్దు.. ఇది తొలిదశలోనే గుర్తిస్తే.. నయమయ్యే వ్యాధి అని తెలుసుకోండి. ఆపరేషన్ లేదా రేడియేషన్ థెరపీ చేయించుకోవడం వలన గర్భాశయ క్యాన్సర్ ను చాలా వరకు నయం చేసుకోవచ్చు.

అందుకే 30 ఏళ్లు దాటినప్పటినుంచి క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోమని డాక్టర్లు సూచిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ అనేది మానవ పపిల్లోమా వైరస్ (హ్యూమన్ పపిల్లోమా వైరస్, హెచ్​పీవీ) వల్ల సంభవిస్తుంది. ముఖ్యంగా హెచ్​పీవీ 16, హెచ్​పీవీ 18 వల్ల ఈ క్యాన్సర్​ వస్తుంది. అందుకనే 30 ఏళ్ళు దాటిన మహిళలు ప్రతి మూడు సంవత్సరాల కు పాప్ స్మెర్ పరీక్ష చేయించుకోవడం మంచిది. కుటుంబంలో ఇంతకు ముందు ఎవరైనా క్యాన్సర్ బారిన పడిన వారున్నా.. గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కనుక గర్భాశయంలో జరిగే సహజ మార్పులను ప్రతీ స్త్రీ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే గైనకాలజిస్ట్​ను సంప్రదించాలి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ నుంచి ఈజీగా బయటపడవచ్చు.

Also Read:  సభను ఉద్దేశించి ప్రసంగిస్తోన్న సీఎం కేసీఆర్‌.. ప్రతిపక్షాలపై మండిపాటు..

 శివ ప్రసన్నం కోసం శునకాల్లా మారే భక్తులు.. ఇలా చేస్తేనే కోర్కెలు తీరుతాయట..! ఎక్కడో తెలుసా..?