AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imrankhan: ఇమ్రాన్‌ ఖాన్‌… ఇప్పటికైనా మీకు అర్థమైందా…? అంతర్జాతీయంగా అప్రతిష్టతను మూటగట్టుకుంటున్న పాకిస్థాన్‌

Imrankhan:  భారత్‌పై వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ముందుకెళ్తున్న దయాది దేశమైన పాకిస్థాన్‌ అంతర్జాతీయంగా నవ్వులపాలవుతోంది. దౌత్య మర్యాదలను, అంతర్జాతీయ సంప్రదాయాలను..

Imrankhan: ఇమ్రాన్‌ ఖాన్‌... ఇప్పటికైనా మీకు అర్థమైందా...? అంతర్జాతీయంగా అప్రతిష్టతను మూటగట్టుకుంటున్న పాకిస్థాన్‌
Imran Khan
Subhash Goud
|

Updated on: Mar 25, 2021 | 7:15 PM

Share

Imrankhan:  భారత్‌పై వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ముందుకెళ్తున్న దయాది దేశమైన పాకిస్థాన్‌ అంతర్జాతీయంగా నవ్వులపాలవుతోంది. దౌత్య మర్యాదలను, అంతర్జాతీయ సంప్రదాయాలను విస్మరించి ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల అప్రతిష్టతను మూటగట్టుకుంటోంది. అదే సమయంలో భారత్‌ హుందాగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ సమాజం నుంచి మన్ననలు అందుకుంటోంది. ఒక్క కశ్మీర్‌ మినహా మిగితా ఏ విషయంలోనూ భారత్‌కు పాక్‌తో ఎలాంటి విబేధాలు లేవనే చెప్పాలి. దీనికి కూడా శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెబుతోంది. కానీ ఇస్లామాబాద్‌ ఈ విషయాన్ని విస్మరిస్తూ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఫలితంగా ఉభయ దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.

ఇక తాజా విషయానికి వస్తే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ శ్రీలంక పర్యటనకు సంబంధించి భారత్‌ తన హుందాతనాన్ని వ్యవహరించింది. ఫిబ్రవరి 22,23 తేదీల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ కొలంబో అధికారిక పర్యటనకు వెళ్లారు. ఇస్లామాబాద్‌ నుంచి కొలంబో వెళ్లేందుకు భారత గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు భారత్‌ ఎలాంటి ఆంక్షలు విధించకుండా అనుమతులు మంజూరు చేసి భారత్‌ పెద్ద మనసును చాటుకుంది. పాకిస్థాన్‌ నుంచి శ్రీలంకకు వెళ్లాలంటే అనివార్యంగా భారత గగనతలం మీదుగా ప్రయాణించాల్సి ఉంది. అదే పాక్‌ గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలకు పాకిస్థాన్‌ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు ఇస్లామాబాద్‌ నిరాకరించి తన వక్రబుద్దిని చాటుకుంది.

అయితే 2019లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐరోపా పర్యనటకు వెళ్లేందుకు తన గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్థాన్‌ నిరాకరించింది. దీంతో కోవింద్‌ చుట్టూ తిరిగి ఐరోపా వెళ్లాల్సి వచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్‌ నెలలో ప్రధాని మోదీ సౌదీ ఆరేబియా పర్యటనకు వెళ్లేందుకు సిద్దం కాగా, గగనతలాన్ని వాడుకునేందుకు పాక్‌ నిరాకరించింది. అదే ఏడాది అక్టోబర్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్లేందుకు రెడీ కాగా, మళ్లీ తన గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్థాన్‌ నిరాకరించి తన వక్రబుద్దిని నిరూపించుకుంది. సాధారణంగా దేశాధినేతల పర్యటనలకు సంబంధించి ఇతర దేశాల గగనతలాన్ని వాడుకునేందుకు దేశం అభ్యంతరం చెప్పదు. ఇది అంతర్జాతీయంగా, దౌత్యపరంగా చిరకాలంగా వస్తున్న సంప్రదాయం. దీనిని ఏ దేశం ఉల్లంఘించేంచే ప్రయత్నించదు. కానీ భారత్‌ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్న పాకిస్థాన్‌ దీనిని విస్మరించి తన వక్రబుద్దిని చాటుకుంది. కానీ భారత్‌ మాత్రం గతాన్ని విస్మరించి ఇమ్రాన్‌ పర్యటన విషయంలో ఉదారంగా వ్యవహరించి తన పెద్ద మనసును చాటుకుంది భారత్‌. రెండు దేశాల వ్యవహార శౌలికి ఇంతకు మించిన మరో నిదర్శనం లేదని చెప్పకతప్పదు.

ఇమ్రాన్‌ ఖాన్‌కు దక్కని గౌరవం

కాగా, ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఇమ్రాన్‌ పర్యటనలో శ్రీలంక పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. కానీ ఈ సందర్బంగా కశ్మీర్‌ విషయాన్ని ప్రస్తావిస్తారన్న అనుమాంతో ఏకంగా ఈ కార్యక్రమాన్ని లంక రద్దు చేసింది. దీని వల్ల భారత్‌తో సంబంధాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో విధంగా వ్యవహరించింది. తన పర్యటనల్లో ఆయా దేశాల పార్లమెంట్లలో ప్రసంగించడం అరుదైన గౌరవంగా దేశాధినేతలు పరిగణిస్తారు. గతంలో పాకిస్థాన్‌ దివంగత అధినేతలు 1963లో ఆయూబ్‌ ఖాన్‌, 1975లో జుల్ఫికర్ ఆలీభుట్టో ఈ గౌరవాన్ని పొందారు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం ఈ గౌరవానికి నోచుకోలేదు. ఇక దివంగత ప్రధానులు 1962లో నెహ్రూ, 1973లో ఇందిరాగాంధీ, 1979లో మొరార్జీ దేశాయ్ ఈ గౌరవాన్ని పొందారు. తాజాగా 2015లో లంక పర్యటనకు వెళ్లి ప్రధాని మోదీ అక్కడి పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించడం గమనార్హం. ఇమ్రాన్‌ మాత్రం ఆ గౌరవానికి నోచుకోలేదు. అయితే పాక్‌ ఇంత చేస్తున్నా.. భారత్‌ మాత్రం ఎలాంటి శతృత్వం చూపించకుండా పెద్ద మనసును చాటుకుంటోంది. ఈ విషయం ఇమ్రాన్‌కు అర్థమవుతుందా.? లేదా..? అనేది తెలియాలి.

ఇవీ చదవండి :

సముద్రంలోకి దూసుకెళ్లిన రెండు బాలిస్టిక్ క్షిపణులు, నార్త్ కొరియా మరో ప్రయోగం., జపాన్ ఆగ్రహం

బ్రిటన్‌లో భారీ ప్యాలస్‌ను అద్దెకు తీసుకున్న ఆదార్ పూనావాలా , సీక్రెట్ గార్డెన్స్ కూడా