సముద్రంలోకి దూసుకెళ్లిన రెండు బాలిస్టిక్ క్షిపణులు, నార్త్ కొరియా మరో ప్రయోగం., జపాన్ ఆగ్రహం

నార్త్ కొరియా తాజాగా రెండు బాలిస్టిక్ మిసైళ్లను సముద్రంలోకి ప్రయోగించింది. ఇవి జపాన్  సమీపంలోని ఎకనమిక్ జోన్ బయట పడ్డాయని  ఆదేశ  ప్రధాని  యోషిహిడ్ సుగా తెలిపారు. నార్త్ కొరియా చర్యలపై ఆయన...

సముద్రంలోకి దూసుకెళ్లిన రెండు బాలిస్టిక్ క్షిపణులు, నార్త్ కొరియా మరో ప్రయోగం., జపాన్ ఆగ్రహం
North Korea Launches Two Missiles Into Japan Sea
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 25, 2021 | 11:09 AM

నార్త్ కొరియా తాజాగా రెండు బాలిస్టిక్ మిసైళ్లను సముద్రంలోకి ప్రయోగించింది. ఇవి జపాన్  సమీపంలోని ఎకనమిక్ జోన్ బయట పడ్డాయని  ఆదేశ  ప్రధాని  యోషిహిడ్ సుగా తెలిపారు. నార్త్ కొరియా చర్యలపై ఆయన నిరసన వ్యక్తం చేశారు.  తాము పరిస్థితిని జాగ్రత్తగా  సమీక్షిస్తున్నామని, తమ దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని సైనిక వర్గాలు తెలిపాయి. ఏడాది కాలంగా ఉత్తర కొరియా ఎలాంటి  మిసైళ్ళ ప్రయోగానికి పూనుకోలేదని, ఇప్పుడు మళ్ళీ ఈ విధమైన రెచ్ఛగొట్టే చర్యలకు పాల్పడుతోందని  సుగా అన్నారు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా డెవలప్ చేయరాదు. ఇలాంటి నిషేధం ఉంది. ఈ నెల 21 న కూడా రెండు మిసైళ్లను నార్త్ కొరియా ప్రయోగించినా అవి బాలిస్టిక్ క్షిపణులు కావు. జపాన్ సముద్రంలోకి ఈ  మిసైళ్ళూ దూసుకు వెళ్లాయని, సౌత్ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. తమ ఆయుధ పాటవాన్ని తెలిపేందుకే నార్త్ కొరియా మళ్ళీ ఈ విధమైన ప్రయోగాలు చేస్తోందని ఆయన చెప్పారు.  కాగా అమెరికా మిత్ర దేశమైన జపాన్ మీద కూడా ఉత్తర కొరియా ఆగ్రహంగా ఉంది. తమ దేశంపై వివిధ దేశాలు ఆంక్షలు విదించడానికి జపాన్ కారణమని ఈ దేశం ఆరోపిస్తోంది.

అటు ఈ దేశ క్షిపణి పరీక్షలను అమెరికా తేలిగ్గా తీసుకుంది. వీటి వల్ల సుస్థిరతకు ఎలాంటి ప్రమాదం లేదని అధ్యక్షుడు జొబైడెన్ వ్యాఖ్యానించారు. దీన్ని తాము పరిగణన లోకి తీసుకోబోమన్నారు. లోగడ డోనాల్డ్ ట్రంప్ హయాంలో ఆయన నార్త్ కొరియాతో సఖ్యతకు కాస్త చొరవ తీసుకున్నారు.  ఒక సందర్భంలో ఆయన నార్త్ కొరియా అధినేత కిమ్ తో సమావేశమయ్యారు. కానీ ఆ తరువాత కిమ్ మొండి వైఖరి కారణంగా అమెరికా-నార్త్ కొరియా మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి . ఇప్పుడు జొబైడెన్ ఈ దేశంపట్ల ఎలాంటి వైఖరి అనుసరిస్తారో చూడాలి .

మరిన్ని చదవండి ఇక్కడ :భారత్‌లో మితిమీరి రెచ్చిపోతున్న కరోనా సెకండ్ వేవ్..18 రాష్ట్రలో లాక్‌డౌన్..? : Coronavirus in India video.

నడిరోడ్డుపై తలస్నానం, షేవింగ్ చేస్తూ హల్ చల్ చేసిన వ్యక్తి. ..వైరల్ అవుతున్న వీడియోలు,ఫోటోలు : man bathing on Road Video

 ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా..వీడి చేష్టలకు నెటిజెన్ల ఫిదా !:Little Boy Funny Video.

జోస్ బట్లర్‌కు భారీ ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందంటే?
జోస్ బట్లర్‌కు భారీ ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందంటే?
గరిష్ట స్థాయికి చేరుకున్న భారతదేశ వ్యాపార కార్యకలాపాలు..
గరిష్ట స్థాయికి చేరుకున్న భారతదేశ వ్యాపార కార్యకలాపాలు..
Shreyas Iyer: అదరగొట్టిన అయ్యర్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర
Shreyas Iyer: అదరగొట్టిన అయ్యర్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!
దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం