నాతో సెల్ఫీయా ? మజాకా ? మహిళజుట్టును లటుక్కున పట్టి గుటుక్కున నమిలేసిన ఒంటె వైరల్ వీడియో.

సెల్ఫీ అంటే మరీ పిచ్చ మోజుగా   ఉన్నా ప్రమాదమే ! ఎక్కడబడితే అక్కడ,, అదేపనిగా సెల్ఫీలు తీసుకుందామనుకునేవారికి ఓ ఒంటె మంచి గుణపాఠమే నేర్పింది. సెల్ఫీ మోజు ఓ మహిళ జుట్టుకు ఎసరు తెచ్చింది.

  • Umakanth Rao
  • Publish Date - 12:20 pm, Thu, 25 March 21
నాతో సెల్ఫీయా ? మజాకా ? మహిళజుట్టును లటుక్కున పట్టి గుటుక్కున నమిలేసిన ఒంటె వైరల్ వీడియో.
Camel Chews Off Woman's Hair

సెల్ఫీ అంటే మరీ పిచ్చ మోజుగా   ఉన్నా ప్రమాదమే ! ఎక్కడబడితే అక్కడ,, అదేపనిగా సెల్ఫీలు తీసుకుందామనుకునేవారికి ఓ ఒంటె మంచి గుణపాఠమే నేర్పింది. సెల్ఫీ మోజు ఓ మహిళ జుట్టుకు ఎసరు తెచ్చింది. జంతువులతో ఇలాటి సరదాలు తగవని ఆ ఒంటె  చెప్పకనే చెప్పిందని ఇది చూసినవాళ్లంతా అంటున్నారు. ఎక్కడో తెలియదు గానీ..   ఓ మహిళ ఓ జూకు వెళ్లి అక్కడ ఎన్ క్లోజర్ లో ఉన్న ఒంటెను చూసి ముచ్చట పడింది. అదేమో అవతల ఉంది.. తాను బయటే నిలబడి దానితో సెల్ఫీ తీసుకోవడానికి ఆ ఎన్ క్లోజర్ కి మరీ దగ్గరగా వెళ్ళింది. తన మొబైల్ లో ఆ ఒంటె కనబడేట్టు సెల్ఫీ తీసుకుంటుండగా  అది కామ్ గా తన ముఖాన్ని ముందుకు చాచి ఆమె జుట్టును నోటితో అందుకుంది.  (బహుశా ఫుడ్ఆ అనుకుందో ఏమో..లేదా సెల్ఫీ తీసుకుంటున్నందుకు ఆగ్రహించిందేమో..)  ఆమె వదిలించుకోబోగా అది ఒక్కసారిగా జుట్టును పట్టుకుని లాగడంతో అసలే కురచ జుట్టేమో చాలావరకు దాని నోట్లోకి వెళ్ళింది. అంతే ! గడ్డినో, ఆకులనో నమిలినట్టు ఆ ఒంటె ఆ జుట్టును నమిలేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్  అయింది. షాక్ తిన్న ఆ మహిళ ఒక్కసారిగా దానికి దూరంగా పరుగెత్తినంత పని చేసింది.

ఇలా జంతువులతో సెల్ఫీ తీసుకుంటే డేంజరే సుమా అని అంటున్నారు. ఓ సందర్భంలో రోడ్ లో ఒక  మేక వద్ద సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ మహిళపై  కూడా అది ఆగ్రహించినట్టు ఉంది. వెనక్కి వెళ్ళినట్టే వెళ్లి ఒక్కసారిగా ముందుకు వఛ్చి ఆమెపై లంఘించింది.  దీంతో  బిత్తర పోయిన ఆమె దాన్ని వదిలించుకుని  అక్కడ ఉండకుండా పరుగే పరుగు !

మరిన్ని చదవండి ఇక్కడ :భారత్‌లో మితిమీరి రెచ్చిపోతున్న కరోనా సెకండ్ వేవ్..18 రాష్ట్రలో లాక్‌డౌన్..? : Coronavirus in India video.

నడిరోడ్డుపై తలస్నానం, షేవింగ్ చేస్తూ హల్ చల్ చేసిన వ్యక్తి. ..వైరల్ అవుతున్న వీడియోలు,ఫోటోలు : man bathing on Road Video

 ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా..వీడి చేష్టలకు నెటిజెన్ల ఫిదా !:Little Boy Funny Video.