బ్రిటన్‌లో భారీ ప్యాలస్‌ను అద్దెకు తీసుకున్న ఆదార్ పూనావాలా , సీక్రెట్ గార్డెన్స్ కూడా
సెంట్రల్ లండన్ లో భారీ ప్యాలస్ ను కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిదారు ఆదార్ పూనావాలా కళ్ళు తిరిగే ధరకు అద్దెకు తీసుకున్నారు. దీనికి ఆయన వారానికి 69 వేల డాలర్ల రెంట్ చెల్లిస్తారట..
సెంట్రల్ లండన్‌లో భారీ ప్యాలస్‌ను కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిదారు ఆదార్ పూనావాలా కళ్ళు తిరిగే ధరకు అద్దెకు తీసుకున్నారు. దీనికి ఆయన వారానికి 69 వేల డాలర్ల రెంట్ చెల్లిస్తారట.. మేఫెయిర్ లో ఇలా అత్యంత విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకోవడమంటే మాటలు కాదు. 25 వేల చదరపు అడుగుల స్థలంలో ఉన్న ఈ భవనం సహజంగానే పోష్ లొకాలిటీలో ఉంది. పూణే లోని సీరం ఇన్స్ టి ట్యూట్ సీఈఓ అయిన ఆదార్ పూనావాలా.. ఇంత భారీ మొత్తానికి ఈ మ్యాన్షన్ ని ఎందుకు అద్దెకు తీసుకున్నారన్నది మిస్టరీగా ఉంది. ఇది సగటున సుమారు 24 సాధారణ ఇంగ్లీషు కుటుంబాలు నివసించే ఇళ్లకు సమానమైన భవంతి అని తెలుస్తోంది. ఈ డీల్ ని ఆయన సీక్రెట్ గా ఉంచదలిచినప్పటికీ ఎలాగో లీక్ అయింది. తమ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి ఈ విషయం వెల్లడించారు. ఇందులో విశాలమైన గెస్ట్ హౌస్ తో బాటు సీక్రెట్ గార్డెన్స్ కూడా ఉన్నాయని, అవి ఇక్కడ నివసించేవారికి మాత్రమే తెలుస్తాయని అంటున్నారు. మేఫెయిర్ సీక్రెట్ గార్డెన్స్ అంటే విలాసవంతమైన, ఖరీదైన ప్రాంతమని చెప్పకనే చెబుతున్నారు.
ఈ డీల్ గురించి సీరం ఇన్స్ టి ట్యూట్ ప్రతినిధి గానీ, ఆదార్ పూనావాలా మేనేజర్ గానీ వివరించేందుకు నిరాకరించారు. గత అయిదేళ్లుగా ఈ ప్రాంతంలో అద్దెలు దారుణంగా పడిపోయాయి. ఇందుకు కారణం ఏడాదిగా కరోనా పాండమిక్ కాగా ఇది మరీ పోష్ లొకాలిటీ కావడంతో భారీస్దాయిన ఉండే అద్దెలు చెల్లించలేక చాలామంది ఇటు చూడడమే మానేశారు. మేఫెయిర్ ప్రాంతంలో 9.2 శాతం అద్దెలు పడిపోయాయని సంబంధిత ప్రాంతాలవారు తెలిపారు. ప్రాపర్టీ డేటా కంపెనీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. కోట్లాది డోసుల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను తమ సంస్థ ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఆదార్ పూనావాలాకి లండన్ తో విడదీయరాని అనుబంధం ఉంది. లండన్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ లో ఆయన చదువుకున్నారట.
మరిన్ని చదవండి ఇక్కడ :భారత్‌లో మితిమీరి రెచ్చిపోతున్న కరోనా సెకండ్ వేవ్..18 రాష్ట్రలో లాక్‌డౌన్..? : Coronavirus in India video.
ఈ బుడతడి నాటకాలు అన్నీ ఇన్నీ కాదు సుమా..వీడి చేష్టలకు నెటిజెన్ల ఫిదా !:Little Boy Funny Video.